కరోనా ఎఫెక్ట్ : ఆ 10 మందికి దేశ బహిష్కరణ..

|

Jul 13, 2020 | 6:29 PM

కరోనా నియంత్రణపై సింగపూర్ సర్కార్ ఫోకస్ పెట్టింది. కట్టడి కోసం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో ఏ ఒక్క‌రు కోవిడ్ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించినా వారికి భారీ స్థాయిలో జ‌రిమానా విధించ‌డమే కాకుండా క‌ఠిన చ‌ర్య‌లు కూడా తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఉండే కొంత‌మంది‌ భార‌తీయులపై సింగ‌పూర్ సర్కార్ చర్యలు తీసుకుంది. స‌ర్క్యూట్ బ్రేక‌ర్ ఉల్లంఘించిన‌ ప‌దిమంది భార‌తీయుల‌ను బ‌హిష్క‌రించింది. వారి పాసుల‌ను సైతం ర‌ద్దు చేశామ‌ని తెలిపింది. భవిష్య‌త్తులోనూ వారు త‌మ దేశంలోకి వ‌చ్చేందుకు […]

కరోనా ఎఫెక్ట్ : ఆ 10 మందికి దేశ బహిష్కరణ..
singapore
Follow us on

కరోనా నియంత్రణపై సింగపూర్ సర్కార్ ఫోకస్ పెట్టింది. కట్టడి కోసం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో ఏ ఒక్క‌రు కోవిడ్ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించినా వారికి భారీ స్థాయిలో జ‌రిమానా విధించ‌డమే కాకుండా క‌ఠిన చ‌ర్య‌లు కూడా తీసుకుంటోంది.

ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఉండే కొంత‌మంది‌ భార‌తీయులపై సింగ‌పూర్ సర్కార్ చర్యలు తీసుకుంది. స‌ర్క్యూట్ బ్రేక‌ర్ ఉల్లంఘించిన‌ ప‌దిమంది భార‌తీయుల‌ను బ‌హిష్క‌రించింది. వారి పాసుల‌ను సైతం ర‌ద్దు చేశామ‌ని తెలిపింది. భవిష్య‌త్తులోనూ వారు త‌మ దేశంలోకి వ‌చ్చేందుకు అనుమ‌తించ‌బోమ‌ని స్పష్టం చేసింది. వీరిలో ఉపాధి కోసం వ‌చ్చిన‌వారితో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు.

వీరు చేసిన తప్పేంటో తెలుసా.. కరోనా ఆంక్షలను ఉల్లఘించడమే. మే 5న ఓ ఇంటిలో గుమిగూడ‌టంతో సింగ‌పూర్ పోలీసులు ప‌ట్టుకున్నారు. నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించార‌ని గ‌తంలోనే వీరికి 2 వేల నుంచి 4500 సింగ‌పూర్ డాల‌ర్ల వ‌ర‌కు జ‌రిమానా విధించారు. ఇందులో సోషల్ డిస్టెన్స్ పాటించక పోవడం… నిబంధనలు గాలికి వదిలేసారనే ఆరోపణలు చేసింది ప్రభుత్వం.

కాగా కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో సింగ‌పూర్ ఏప్రిల్ 7న స‌ర్క్యూట్ బ్రేక‌ర్ నిబంధ‌న‌ను అమల్లోకి తెచ్చింది. దీని ప్ర‌కారం అక్క‌డి ప్ర‌జ‌లు నిత్యావ‌స‌రాల‌కు మాత్ర‌మే బ‌య‌ట‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఉంటుంది.