కరోనా దెబ్బ: నల్గొండ వ్యాపారస్థుల కీలక నిర్ణయం

Shop-Owners Cut Down Biz Timings : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధలను అమలు చేస్తున్నప్పటికీ రోజురోజుకూ నల్గొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో.. నల్గొండ వర్తక సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో జనరల్‌ దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం2 గంటల వరకు మాత్రమే తెరవాలని నిర్ణయించారు. అత్యంత రద్దీగా ఉండే […]

కరోనా దెబ్బ: నల్గొండ వ్యాపారస్థుల కీలక నిర్ణయం

Updated on: Jul 03, 2020 | 10:26 AM

Shop-Owners Cut Down Biz Timings : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధలను అమలు చేస్తున్నప్పటికీ రోజురోజుకూ నల్గొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో.. నల్గొండ వర్తక సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో జనరల్‌ దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం2 గంటల వరకు మాత్రమే తెరవాలని నిర్ణయించారు. అత్యంత రద్దీగా ఉండే కిరాణా దుకాణాలు, స్టేషనరీ, మొబైల్ రీచార్జ్ సెంటర్లు తప్పకుండా మూసి ఉంచాలని నిర్ణయించారు. నెహ్రూ గంజ్‌లో ని హోల్ సేల్ దుకాణాలు కూడా మధ్యహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ నిబంధనలను ఉల్లఘించినవారికి రూ.2వేలను ఫైన్ విధించనున్నారు.

ఇక ప్రకాశం బజార్‌లోని కూరగాయల మార్కెట్ సముదాయంలోని దుకాణాలను సాయంత్రం 5 గంటల వరకే తెరిచి ఉంచుతారని ప్రకటించారు. అత్యంత రద్దీగా ఉండే మార్కెట్‌లో కరోనా వ్యాప్తి జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ‘నల్గొండ జనరల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌’ వెల్లడించింది. గురువారం అసోసియేషన్‌ కార్యాలయంలో వ్యాపారులంతా అత్యవసర సమావేశం నిర్వహించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us