
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ విధించిన తరువాత కూడా ఇండియాలో కరోనా కేసులు నమోదవడం.. అటు అధికారులను ఇటు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కాగా ప్రస్తుతం భారత్‌లో 17,265 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 543 మంది మరణించారు. అలాగే 2,547 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం 14,175 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అటు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఏడు రాష్ట్రాల్లో కోవిడ్ కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి దాటాయి.
ఏడు రాష్ట్రాల్లో వెయ్యి ప్లస్ కేసులు:
కేసుల పరంగా చూస్తే ఏడు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా నమోదయ్యాయి. మహారాష్ట్రలో 4203, ఢిల్లీలో 2003, గుజరాత్‌లో 1743, రాజస్థాన్‌లో 1478, తమిళనాడులో 1477, ఇక మధ్యప్రదేశ్‌లో 1407, అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లో 1084 కేసులు నమోదయ్యాయి.
అలాగే మృతుల్లో 223 మందితో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఇక ఢిల్లీ (45), గుజరాత్ (63), రాజస్థాన్ (14), తమిళనాడు (15), మధ్యప్రదేశ్‌లో (70), ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో (17) మంది మరణించారు.
Read More:
కరోనా టెస్ట్ రిపోర్ట్స్ తారుమారు
నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా..
ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్.. టీఎస్ బోర్డు కీలక నిర్ణయం
ఫేస్‌బుక్‌లో అభ్యంతకర వ్యాఖ్యలు.. ‘రక్త చరిత్ర’ నటుడు అరెస్ట్