కరోనా టెస్ట్ రిపోర్ట్స్ తారుమారు

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేటలో  కరోనా టెస్ట్ రిపోర్ట్స్ తారుమారు కావడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఒకే పేరుతో ఉన్న ఇద్దరు వ్యక్తులకు డాక్టర్లు శాంపిల్స్ సేకరించారు. ఇందులో పాజిటివ్ వచ్చిన వ్యక్తికి.. నెగటివ్ రిపోర్ట్స్‌

కరోనా టెస్ట్ రిపోర్ట్స్ తారుమారు
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 4:06 PM

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేటలో కరోనా టెస్ట్ రిపోర్ట్స్ తారుమారు కావడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఒకే పేరుతో ఉన్న ఇద్దరు వ్యక్తులకు డాక్టర్లు శాంపిల్స్ సేకరించారు. ఇందులో పాజిటివ్ వచ్చిన వ్యక్తికి.. నెగటివ్ రిపోర్ట్స్‌ ఇచ్చారు. దీంతో పేషంట్‌ను గత రాత్రి ఇంటికి పంపించేశారు. పంపిన అనంతరం విషయం గమనించిన వైద్యులు.. హుటాహుటిన పాజిటివ్ వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించారు. అలాగే కుటుంబ సభ్యులు ముగ్గురిని కూడా క్వారంటైన్‌కు తరలించారు. కాగా ఏపీలో ఇప్పటివరకూ మొత్తం 647 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 65 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా 17 మంది మరణించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 565 చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 24 గంటల్లో శనివారం ఒక్క రోజే 44 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read More: 

నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా..

ఇంటర్‌ సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌.. టీఎస్ బోర్డు కీలక నిర్ణయం

ఫేస్‌బుక్‌లో అభ్యంతకర వ్యాఖ్యలు.. ‘రక్త చరిత్ర’ నటుడు అరెస్ట్

రేపటి నుంచి లాక్‌డౌన్ సడలింపులు.. ఏం తెరుచుకుంటాయంటే!