నిమ్స్‌ సిబ్బందికి కరోనా..!

హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా మహమ్మారికి విలవిల్లాడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజగా పంజాగుట్టలోని నిమ్స్‌(నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్)లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఇందులో నలుగురు వైద్యులతో పాటు ముగ్గురు ల్యాబ్ సిబ్బందిగా గుర్తించినట్లు సమాచారం. నిన్న ఉస్మానియా వైద్య కళాశాలలో 12 మంది పీజీ మెడికోలు కరోనా వైరస్ మహమ్మారి బారినపడటం కలకలం సృష్టించింది. ఇప్పుడు తాజాగా నిమ్స్‌లోని వైద్యులకు పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో.. […]

నిమ్స్‌ సిబ్బందికి కరోనా..!

Updated on: Jun 03, 2020 | 2:15 PM

హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా మహమ్మారికి విలవిల్లాడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజగా పంజాగుట్టలోని నిమ్స్‌(నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్)లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఇందులో నలుగురు వైద్యులతో పాటు ముగ్గురు ల్యాబ్ సిబ్బందిగా గుర్తించినట్లు సమాచారం.

నిన్న ఉస్మానియా వైద్య కళాశాలలో 12 మంది పీజీ మెడికోలు కరోనా వైరస్ మహమ్మారి బారినపడటం కలకలం సృష్టించింది. ఇప్పుడు తాజాగా నిమ్స్‌లోని వైద్యులకు పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో.. వైద్య వర్గాలతోపాటు అక్కడ చికిత్స పొందతున్నవారిలో ఆందోళన మొదలైంది.