వాణిజ్య రాజధానిలో 144 సెక్షన్ అమలు

దేశంలో కరోనా కేసుల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో..

వాణిజ్య రాజధానిలో 144 సెక్షన్ అమలు

Updated on: Jul 01, 2020 | 3:47 PM

మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ముంబైలో మళ్లీ 144 సెక్షన్ విధించారు. మహారాష్ట్రలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతుండటంతో ఈ చర్యకు దిగినట్లు అధికారులు చెబుతున్నారు.

144 సెక్షన్ నేపథ్యంలో ముంబైలో బహిరంగ, మతపరమైన ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదని ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అశోక్ చెప్పారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సెక్షన్ 144 నుండి నిత్యావసర, అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అశోక్ వెల్లడించారు.

దేశంలో కరోనా కేసుల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు మొత్తం 1.7 లక్షల మంది కరోనా బారినపడగా 7,610 మంది మరణించారు. మహారాష్ట్రలో 4,810 మంది పోలీసులకు కరోనా సోకింది. వారిలో 59 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us