Taipei lab -Covid 19: కోవిడ్ మహమ్మారి ఇప్పటి వరకూ ఒకరి నుంచి మరొకరి.. కరోనా సోకిన మనుషులు తుమ్మినా, దగ్గినా కరోనా వ్యాపిస్తుందని మాత్రమే తెలుసు.. అయితే ఇప్పుడు ఎలుక కరిచినా కరోనా సోకుతున్నట్లు తేల్చారు. తైవాన్ లోని అత్యంత కట్టుదిట్టమైన బయోసేఫ్టీ లెవల్ 3 ప్రమాణాలు కలిగిన అకాడమికా సినికా అనే జన్యుక్రమ విశ్లేషణ సంస్థలో ఈ ఘటన జరిగింది. దాదాపు నెల రోజులుగా ద్వీప దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా ఎలుక కరవడంతో తొలి కేసు నమోదైంది.
ల్యాబ్ లో పనిచేస్తుండగా ఓ 20 ఏళ్ల సైంటిస్టును కరోనా సోకిన ఎలుక కరిచినట్టు తైవాన్ ఆరోగ్య శాఖ మంత్రి చెన్ షీ చుంగ్ ప్రకటించారు. ఆమె ఇటీవలి కాలంలో ఎక్కడికీ ప్రయాణం చేయలేదని, మోడర్నా ఎంఆర్ఎన్ఏ రెండు డోసుల వ్యాక్సిన్ ను కూడా సైంటిస్ట్ తీసుకున్నారని చెప్పారు. అయితే ఎలుక కరవడం వల్లే కరోనా సోకింది అనేది ప్రాధమిక అంచనా మాత్రమేనని, మరిన్ని టెస్టులు చేశాక దానిని నిర్ధారించాల్సి ఉందని ఓ సీనియర్ వైరాలజిస్ట్ చెప్పారు. కాగా, అకాడమికా సినికాలో జంతువుల్లోని వివిధ వ్యాధి కారక క్రిములను బయటకు తీసి పరిశోధనలను చేస్తుంటారు. టీకా పనితీరు, వాటి ప్రభావం వంటి వాటిని తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే యువ సైంటిస్ట్ కు ఎలుక కరిచిందని అధికారులు చెబుతున్నారు. ఆమెకు డెల్టా వేరియంట్ సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: సాయితేజ ఫ్యామిలీకి లక్ష సాయం ప్రకటించిన చంద్రబాబు.. ప్రభుత్వం కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్..