కరోనా విళయ తాండవం.. ఒక్కరోజే 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు..!

| Edited By:

May 06, 2020 | 9:06 PM

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనిక వ్యాక్సిన్ లేకపోవడంతో.. ప్రపంచ దేశాలన్నింటిని ఇది ముట్టేసింది. ఇప్పటికే యూరప్‌ దేశాలను గజగజ వణికించిన ఈ మహమ్మారి.. ఇప్పుడు రష్యాలో విళయ తాండవం చేస్తోంది. బుధవారం నాడు ఒక్కరోజే ఇక్కడ పదివే ఐదు వందల కేసులు నమోదయ్యాయి. దీంతో రష్యా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,65000 దాటింది. ఈ విషయాన్ని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇప్పటి వరకు […]

కరోనా విళయ తాండవం.. ఒక్కరోజే 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు..!
Follow us on

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనిక వ్యాక్సిన్ లేకపోవడంతో.. ప్రపంచ దేశాలన్నింటిని ఇది ముట్టేసింది. ఇప్పటికే యూరప్‌ దేశాలను గజగజ వణికించిన ఈ మహమ్మారి.. ఇప్పుడు రష్యాలో విళయ తాండవం చేస్తోంది. బుధవారం నాడు ఒక్కరోజే ఇక్కడ పదివే ఐదు వందల కేసులు నమోదయ్యాయి. దీంతో రష్యా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,65000 దాటింది. ఈ విషయాన్ని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి దేశ వ్యాప్తంగా 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు రష్యా వైధ్యాధికారులు వెల్లడించారు. ఇక వరుసగా నాలుగు రోజుల నుంచి దేశంలో పదివేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో.. స్థానిక ప్రజలు వణికిపోతున్నారు. అయితే ఇక్కడ కరోనా సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల దృష్ట్యా అక్కడ ఈ నెల 11వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు గత వారం రష్యా అధ్యక్షడు ప్రకటించారు. అయితే తాజా పరిస్థితిని చేస్తే.. ఇక్కడ లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులపాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.