నిబంధనలను ఉల్లంఘిస్తే “మరోసారి లాక్‌డౌన్”

కరోనా కట్టడిలో “హెల్త్ ప్రొటోకాల్” పాటించ‌కుంటే మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని ఇరాన్ అధ్యక్షుడు రౌహాని ఆ దేశ ప్రజలను హెచ్చరించారు. ఆర్ధిక కార్యకలాపాలు కొనసాగాంటే హెల్త్ ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. లేదంటే మరోసారి మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న ప్రావిన్స్‌ ప్రాంతంలోని ప్ర‌జ‌లు ఇతర ప్రాంతాలకు వెళ్లి వైర‌స్‌ను మోసుకుపోతున్నారని రౌహానీ అసహనం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో నిబంధనలను తప్పకుండా పాటించాలని […]

నిబంధనలను ఉల్లంఘిస్తే మరోసారి లాక్‌డౌన్

Updated on: Jun 13, 2020 | 9:57 PM

కరోనా కట్టడిలో “హెల్త్ ప్రొటోకాల్” పాటించ‌కుంటే మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని ఇరాన్ అధ్యక్షుడు రౌహాని ఆ దేశ ప్రజలను హెచ్చరించారు. ఆర్ధిక కార్యకలాపాలు కొనసాగాంటే హెల్త్ ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. లేదంటే మరోసారి మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న ప్రావిన్స్‌ ప్రాంతంలోని ప్ర‌జ‌లు ఇతర ప్రాంతాలకు వెళ్లి వైర‌స్‌ను మోసుకుపోతున్నారని రౌహానీ అసహనం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు.

ఇదిలావుంటే.. శనివారం ఒక్కరోజే ఇరాన్‌లో 2,410 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 71 మంది కరోనాకు బలయ్యారు. దీంతో ఇరాన్‌లో కరోనా బాధితుల సంఖ్య 1,85,000కు చేరువ‌య్యింది. మృతుల సంఖ్య 8,730కి చేరింది.