
దేశంలో కరోనా వైరస్ రీకవరీ రేటు సుమారు 60 శాతానికి చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వైరస్ నుంచి గత ఇరవై నాలుగు గంటల్లో 1,19,696 మంది రోగులు కోలుకున్నారు. యాక్టివ్ కేసులను ఇవి మించిపోయాయి. మొత్తం రెండు లక్షల పదిహేను వేలకు పైగా యాక్టివ్ కేసులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాయి అని ఈ శాఖ పేర్కొంది. ఖఛ్చితంగా రికవరీ రేటు 59.07 ఉందని ఈ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. అటు… దేశంలో కరోనా వైరస్ కేసులు 5,66,840 కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 418 మంది రోగులు మరణించారు.
ఇండియాలో టెస్టింగ్ ల్యాబ్స్ పెంచుతున్నామని, ట్రాకింగ్ సిస్టం చాలావరకు మెరుగు పడిందని కూడా ప్రభుత్వం తెలిపింది.