ఢిల్లీలో పెనుగాలులు.. వడగండ్ల వాన..

ఢిల్లీ నగరం శనివారం పెనుగాలులు, కుండపోత వర్షంతో వణికిపోయింది. మధ్యాహ్నం నుంచే కారు మబ్బులు కమ్మి ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయింది. వర్షానికి తోడు వడగండ్లు కూడా పడడంతో ఖాళీగా ఉన్న రోడ్లన్నీ తెల్లగా మారిపోయాయి. సోషల్ మీడియాలో ఇక ఈ వీడియోలు, ఫోటోలకు తక్కువే లేదు. లాక్ డౌన్ అమలులో ఉన్న ఈ తరుణంలో వాతావరణం ఇలా ఆహ్లాదకరంగా మారిపోయిందని నెటిజనులు తమ తమ కామెంట్లతో వెల్లువెత్తారు. నిన్న కూడా సాయంత్ర మయ్యేసరికి వాతావరణం ఇలా […]

ఢిల్లీలో పెనుగాలులు.. వడగండ్ల వాన..

Edited By:

Updated on: Apr 18, 2020 | 9:00 PM

ఢిల్లీ నగరం శనివారం పెనుగాలులు, కుండపోత వర్షంతో వణికిపోయింది. మధ్యాహ్నం నుంచే కారు మబ్బులు కమ్మి ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయింది. వర్షానికి తోడు వడగండ్లు కూడా పడడంతో ఖాళీగా ఉన్న రోడ్లన్నీ తెల్లగా మారిపోయాయి. సోషల్ మీడియాలో ఇక ఈ వీడియోలు, ఫోటోలకు తక్కువే లేదు. లాక్ డౌన్ అమలులో ఉన్న ఈ తరుణంలో వాతావరణం ఇలా ఆహ్లాదకరంగా మారిపోయిందని నెటిజనులు తమ తమ కామెంట్లతో వెల్లువెత్తారు. నిన్న కూడా సాయంత్ర మయ్యేసరికి వాతావరణం ఇలా ఉన్నా.. ఇవాళ ఈ రకంగా మారిపోవడం ఢిల్లీ వాసులను సంతోషంలో ముంచెత్తింది. ఉష్ణోగ్రతలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని ఇన్నాళ్లూ వాళ్ళు వెయిట్ చేశారు మరి !