దేశీయ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ !

దేశీయ విమాన ప్రయాణికులకు పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి మంచి వార్త చెప్పారు. వారికి క్వారంటైన్ అవసరం లేదని స్పష్టం చేశారు. స్వల్ప దూరం ప్రయాణించేవారికి కరోనా లక్షణాలున్నవారిని తరలించే క్వారంటైన్ కి పంపాల్సిన అవసరం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇందుకు ఉదాహరణ కూడా చెప్పారాయన.. తను ఏదైనా పని మీద కేరళకు విమానంలో వెళ్తే 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుందని, తిరిగి ఢిల్లీకి వచ్చినప్పుడు […]

దేశీయ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ !

Edited By:

Updated on: May 21, 2020 | 6:52 PM

దేశీయ విమాన ప్రయాణికులకు పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి మంచి వార్త చెప్పారు. వారికి క్వారంటైన్ అవసరం లేదని స్పష్టం చేశారు. స్వల్ప దూరం ప్రయాణించేవారికి కరోనా లక్షణాలున్నవారిని తరలించే క్వారంటైన్ కి పంపాల్సిన అవసరం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇందుకు ఉదాహరణ కూడా చెప్పారాయన.. తను ఏదైనా పని మీద కేరళకు విమానంలో వెళ్తే 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుందని, తిరిగి ఢిల్లీకి వచ్చినప్పుడు అన్ని రోజులూ  మళ్ళీ క్వారంటైన్ లో ఉండాలా అన్నారు. ఇది సాధ్యం కాదు కదా అని వ్యాఖ్యానించారు. బస్సులు, రైళ్లలో ప్రవేశించేవారి క్వారంటైన్ ను, విమాన ప్రయాణికుల క్వారంటైన్ ను పోల్చలేమని, పౌర విమాన యానానికి దీన్ని వర్తింప జేయలేమని హర్ దీప్ సింగ్ పురి క్లారిటీ ఇచ్చారు. సవరించిన నిబంధనల ప్రకారం.. కరోనా లక్షణాలు ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విమాన ప్రయాణానికి అనుమతించే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. అసలు ప్లేన్ లో ప్రయాణించే వారు ట్రావెల్ చేయడానికి తాము ఫిట్ అవుతామా కాదా అని నిర్ధారించుకోవాలన్నారు. విమానాలు ఎగిరే సమయాలను బట్టి ఏడు కేటగిరీలుగా విభజించినట్టు ఆయన వెల్లడించారు.