దారుణం.. పోలీసులపై, ఆశా వర్కర్లపై దాడి.. బారికేడ్లు ధ్వంసం..

ఓవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా.. మరోవైపు అల్లరిమూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా బెంగళూరులో కూడా యూపీలో జరిగినట్లు సేమ్ సీన్‌ రిపీట్ అయ్యింది. ఈ సారి మాత్రం ఇక్కడ అల్లరిమూకలు బారికేడ్లను కూడా ధ్వంసం చేశాయి. కర్ణాటక రాష్ట్ర పోలీసు అధికారి బీ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ బెంగళూరు పరిధిలోని పెద్దనారాయణపురంలో ఈ నెల మొదటి వారంలో […]

దారుణం.. పోలీసులపై, ఆశా వర్కర్లపై దాడి.. బారికేడ్లు ధ్వంసం..

Edited By:

Updated on: Apr 20, 2020 | 7:53 PM

ఓవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా.. మరోవైపు అల్లరిమూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా బెంగళూరులో కూడా యూపీలో జరిగినట్లు సేమ్ సీన్‌ రిపీట్ అయ్యింది. ఈ సారి మాత్రం ఇక్కడ అల్లరిమూకలు బారికేడ్లను కూడా ధ్వంసం చేశాయి.
కర్ణాటక రాష్ట్ర పోలీసు అధికారి బీ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ బెంగళూరు పరిధిలోని పెద్దనారాయణపురంలో ఈ నెల మొదటి వారంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. అయితే ఈ ముగ్గురు కూడా మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్ మత ప్రార్ధనలకు హాజరైనట్లు తేలింది. దీంతో ఈ ముగ్గురు యువకులు ఉన్న ప్రాంతాన్ని పోలీసులు బారికేడ్లు వేసి.. ఆ ప్రాంతంలో అందర్నీ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు.

అంతేకాకుండా ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నా.. వైద్య సిబ్బంది ఆ ప్రాంతంలోనే టెంట్లు వేసి.. ఇంట్లోనే వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి అక్కడి చేరుకున్న ఆశా వర్కర్లు, పోలీసులపైకి స్థానికంగా ఉన్న కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేసుకుంటూ.. వైద్య పరికరాలను పగలగొట్టారు. ఈ ఘటనలో పలువురు ఆశా వర్కర్లు గాయపడ్డారు.

సమాచారం అందుకునన్న వెంటనే డీజీపీ, రాష్ట్ర హోంమంత్రితో సహా పలువురు అధికారులు భారీ బందోబస్త్‌తో ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దాడికి పాల్పడిన 58మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అంతేకాదు.. మిగలిన వారిపై నిర్భందం కొనసాగిస్తామని తెలిపారు. ఈ ఘటనపై సీఎం యడియూరప్ప సీరయస్ అయ్యారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య సిబ్బందికి ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు.