వలస కార్మికులకు రూ. 7,500 ఇవ్వండి.. మోదీ ప్రభుత్వానికి సోనియా డిమాండ్

| Edited By: Pardhasaradhi Peri

May 28, 2020 | 4:58 PM

లక్షలాది వలస కార్మికుల దుస్థితి పట్ల మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. వారి కుటుంబాలకు  వచ్ఛే ఆరు నెలల పాటు రూ. 7,500 ఇవ్వాలని, తక్షణ సాయంగా వారి బ్యాంకు ఖాతాల్లో..

వలస కార్మికులకు రూ. 7,500 ఇవ్వండి.. మోదీ ప్రభుత్వానికి సోనియా డిమాండ్
Follow us on

లక్షలాది వలస కార్మికుల దుస్థితి పట్ల మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. వారి కుటుంబాలకు  వచ్ఛే ఆరు నెలల పాటు రూ. 7,500 ఇవ్వాలని, తక్షణ సాయంగా వారి బ్యాంకు ఖాతాల్లో పది వేల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆమెకోరారు. తమ పార్టీ చేపట్టిన ‘స్పీకప్’ ప్రచారం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం తరువాత మొదటిసారిగా   వలసజీవులు వందలాది కిలోమీటర్ల దూరం కాలినడకన తమ స్వస్థలాలకు వెళ్లడాన్ని ఈ దేశం చూసిందని, కానీ ప్రభుత్వం మాత్రం కళ్ళు మూసుకుందని విమర్శించారు.  కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు.. ఎన్నో చిన్నా, చితకా ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. రైతులు తమ పంటలను అమ్ముకునే స్ధితిలో లేరు అని సోనియా వ్యాఖ్యానించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి దినాలను రెండు వందలకు పెంచాలని, మూత బడిన అనేక ఫ్యాక్టరీలను మళ్ళీ ప్రారంభించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె అభ్యర్థించారు.

వలస కార్మికులు రైతులు, , చిన్న, మధ్యతరహా వ్యాపారుల ప్రయోజనాలకోసం కాంగ్రెస్ పార్టీ ఈ ‘స్పీకప్’ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రచారం సందర్భంగా వారి సంక్షేమం కోసం విరాళాలను సేకరించాలన్నది కూడా ఈ పార్టీ యోచనగా ఉంది.