Covid-19 Vaccine: కోరోనా వ్యాక్సిన్ తీసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఢిల్లీలోని ఆర్ఆర్ ఆసుపత్రిలో మొదటి డోస్

|

Mar 03, 2021 | 1:39 PM

Ram Nath Kovind: దేశంలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రెండోవిడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, పలువురు..

Covid-19 Vaccine: కోరోనా వ్యాక్సిన్ తీసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఢిల్లీలోని ఆర్ఆర్ ఆసుపత్రిలో మొదటి డోస్
Follow us on

Ram Nath Kovind: దేశంలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రెండోవిడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా కోవిడ్-19 టీకా తీసుకున్నారు. ఢిల్లీలోని ఆర్ఆర్ ఆసుపత్రిలో రామ్‌నాథ్ తొలి డోసు టీకాను బుధవారం మధ్యాహ్నం వేయించుకున్నారు. ఇప్పటివరకు ప్రధాని మోదీతోపాటు పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కేంద్ర, రాష్ట్రాల మంత్రులు వ్యాక్సిన్ తీసుకున్నారు.

దేశంలో ఓ వైపు కరోనావైరస్ మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. సోమవారం రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,56,20,749 మందికి కరోనా వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. జనవరి 16 నుంచి ప్రారంభమైన మొదటి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ అందించారు. రెండో విడతలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు.


Also Read:

Covid vaccine: క్షణాల్లోనే విషాదం.. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న వ్యక్తి మృతి

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కి మొదటిసారిగా చుక్కెదురు, ఉన్నత స్థాయి పోస్టుకు ఇండో-అమెరికన్ నియామకం రద్దు