సురక్షిత ప్రయాణం కోసం “ పోస్ట్ కోవిడ్ బోగీ’’!

కరోనా నేపథ్యంలో సురక్షిత ప్రయాణం కోసం భారతీయ రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ‘ పోస్ట్‌ కోవిడ్‌ బోగీ’ పేరుతో మెరుగైన సదుపాయాలతో రైలుబోగీని రూపొందించింది. చేతులతో తాకాల్సిన అవసరంలేకుండా సరికొత్త సదుపాయాలు,

సురక్షిత ప్రయాణం కోసం “ పోస్ట్ కోవిడ్ బోగీ’’!

Updated on: Jul 15, 2020 | 4:39 PM

కరోనా నేపథ్యంలో సురక్షిత ప్రయాణం కోసం భారతీయ రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ‘ పోస్ట్‌ కోవిడ్‌ బోగీ’ పేరుతో మెరుగైన సదుపాయాలతో రైలుబోగీని రూపొందించింది. చేతులతో తాకాల్సిన అవసరంలేకుండా సరికొత్త సదుపాయాలు, రాగిపూత పూసిన హ్యాండ్‌ రెయిలింగ్స్‌, తలుపుల గడియలు, ఏసీ బోగీల్లో గాలి శుద్ధీకరణ వ్యవస్థ, టిటేనియం డై ఆక్సైడ్‌ పూత తదితర ఏర్పాట్లు చేశారు.

వైరస్ కణాలను రాగి కేవలం కొన్ని గంటల్లోనే క్షీణింపజేస్తుంది. పలు సూక్ష్మజీవులను కట్టడిచేసే స్వభావం కూడా రాగికి ఉంది. వైరస్ రాగిపై పడినపుడు రోగకారకమైన ప్యాథోజెన్లను రాగి అయాన్ దెబ్బతీసి, వైరస్ లోని డి.ఎన్.ఎ., ఆర్.ఎన్.ఎ.లను నాశనం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రైల్వే శాఖ రాగిపూతతో ఏర్పాట్లు చేసింది. రైలు ప్రయాణాల్లో కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు భారతీయ రైల్వేశాఖ పలు చర్యలు తీసుకుంటోంది. కపూర్తలా లోని రైలు బోగీల తయారీ కర్మాగారం ఈ విభిన్నమైన బోగీని రూపొంచింది.