భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఇరువురూ జాతీయ, అంతర్జాతీయంగా ఉన్న ప్రధాన అంశాలపై రాష్ట్రపతి భవన్‌లో చర్చించారు. తూర్పు లద్దాఖ్ లేహ్‌లోని ప్రధాని క్షేత్రస్థాయి పర్యటన అనంతరం రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తన పర్యటన గురించి మోదీ, రాష్ట్రపతికి వివరించినట్టు రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది. అలాగే కరోనా వైరస్ పరిస్థితులపై కూడా ఇరువురూ చర్చించినట్లు సమాచారం.
కాగా గత కొద్దిరోజులుగా ఇండియా-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్ లేహ్‌లో పర్యటించి, అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గాల్వాన్ ఘటనలో మరణం పొందిన అమర వీరులకు నివాళలర్పించారు. అనంతరం గాయపడ్డ జవాన్లను పరామర్శించిన తర్వాత చైనాను ఉద్ధేశించి తీవ్ర హెచ్చరికలు చేశారు.
#WATCH Prime Minister Narendra Modi called on President Ram Nath Kovind and briefed him on the issues of national and international importance at Rashtrapati Bhavan today pic.twitter.com/YPqOxAvtuK
— ANI (@ANI) July 5, 2020