సీనియర్ మంత్రులతో మోదీ భేటీ.. ‘కరోనా’ పై సమీక్ష

కరోనా వైరస్ పై జరుపుతున్న పోరాటంలో దేశం ఎంతవరకు సఫలీకృతమైందన్న అంశాన్ని, సన్నధ్దతను సమీక్షించేందుకు ప్రధాని మోదీ శనివారం సీనియర్ మంత్రులతోనూ, అధికారులతోను సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో ఇప్పటివరకు..

సీనియర్ మంత్రులతో మోదీ భేటీ.. కరోనా పై సమీక్ష

Edited By:

Updated on: Jun 13, 2020 | 7:50 PM

కరోనా వైరస్ పై జరుపుతున్న పోరాటంలో దేశం ఎంతవరకు సఫలీకృతమైందన్న అంశాన్ని, సన్నధ్దతను సమీక్షించేందుకు ప్రధాని మోదీ శనివారం సీనియర్ మంత్రులతోనూ, అధికారులతోను సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో ఇప్పటివరకు ఎంతవరకు పోరాడగలిగామన్న  విషయాన్ని ఆయన మదింపు చేశారు. ఈ వైరస్ కట్టడిలో ఆయా రాష్ట్రాల కృషి గురించి  కూడా ఆయన తెలుసుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్షవర్ధన్, ఇతర  సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈనెల 16, 17 తేదీలలో మోదీ…  21 రాష్ట్రాలు,  కేంద్ర పాలిత ప్రాంతాల సీఎం లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా అంశంపై చర్చించనున్నారు. దానికి సన్నాహసూచనగా ఆయన ఇవాళ ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.