అన్నదాతలే మనకి గర్వకారణం.. ‘మన్‌కీ బాత్’లో ప్రధాని

| Edited By:

Aug 30, 2020 | 12:07 PM

ప్రధాని నరేంద్ర మోదీ మన్ ‌కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోదీ రైతుల గురించి, పర్యావరణాన్ని ఉద్ధేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మన్‌కీ బాత్‌లో మోదీ మాట్లాడుతూ.. ఆకలి తీరుస్తున్న అన్నదాతలను చూసి మనమంతా..

అన్నదాతలే మనకి గర్వకారణం.. మన్‌కీ బాత్లో ప్రధాని
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీ మన్ ‌కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోదీ రైతుల గురించి, పర్యావరణాన్ని ఉద్ధేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మన్‌కీ బాత్‌లో మోదీ మాట్లాడుతూ.. ఆకలి తీరుస్తున్న అన్నదాతలను చూసి మనమంతా గర్వపడాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలి. కులవృత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కరోనా సమయంలోనూ రైతులు కష్టపడుతున్నారు. ఈ ఖరీఫ్‌లో గతేడాది కంటే ఎక్కువ సాగు చేస్తున్నారు. ప్రతీ పండుగను పర్యావరణ హితంగా చేసుకోవాలి. కేరళ ఓనం పండుగ ఉత్సాహం ఇవాళ ప్రపంచం నలుమూలలకు చేరింది. విదేశీ వస్తువులకు బదులు స్వదేశీ వస్తువులను ప్రొత్సహించాలి. స్వదేశీ కంప్యూటర్ గేమ్స్ తయారీకి ప్రాధాన్యత ఇవ్వాలని మన్‌కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

అలాగే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కొత్త ఆన్‌లైన్ గేమింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని దేశ యువతకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోక్‌లో భాగంగా దేశీయంగా బొమ్మలు తయారీ చేసేందుకు ముందుకు రావాలని స్టార్టప్‌ కంపెనీలు, యువతను కోరారు మోదీ. బొమ్మల పరిశ్రమ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందన్నారు ప్రధాని మంత్రి.

Read More:

మరో ఏపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

బ్రేకింగ్: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ బిల్డింగ్ సీల్డ్