కేంద్ర‌మంత్రుల‌కు క‌రోనా టెన్ష‌న్‌..పీఐబీ చీఫ్‌కు పాజిటివ్‌

భార‌త్‌ను క‌రోనా మ‌హ‌మ్మారి ప‌ట్టిపీడిస్తోంది. దేశంలో వైర‌స్ పాజిటివ్ కేసు సంఖ్య‌ రోజురోజుకి పెరిగిపోతూ ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ..దేశమంతటికీ వైరస్ కేసుల వివరాలను తాజా పరిస్థితులను అంద‌జేస్తున్న‌ పీఐబీ వైర‌స్ ఎఫెక్ట్‌తో మూతపడింది.

కేంద్ర‌మంత్రుల‌కు క‌రోనా టెన్ష‌న్‌..పీఐబీ చీఫ్‌కు పాజిటివ్‌

Updated on: Jun 08, 2020 | 8:29 PM

భార‌త్‌ను క‌రోనా మ‌హ‌మ్మారి ప‌ట్టిపీడిస్తోంది. దేశంలో వైర‌స్ పాజిటివ్ కేసు సంఖ్య‌ రోజురోజుకి పెరిగిపోతూ ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని పీఐబీ చీఫ్ కు వైరస్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో దేశమంతటికీ  వైరస్ కేసుల వివరాలను తాజా పరిస్థితులను అంద‌జేస్తున్న‌ రాజధాని న్యూఢిల్లీలోని పీఐబీ మూతపడింది.
ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ప్రిన్సిపల్‌ కేఎస్‌ ధత్వాలియాకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణయ్యింది. పిఐబికి నాయకత్వం వహించే ధత్వాలియా కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రధాన ప్రతినిధి. కరోనా పాజిటివ్‌ రావడంతో చికిత్స కోసం ఆయనను ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లో గత రాత్రి 7 గంటల సమయంలో జాయిన్‌ చేశారు. అయితే అతని ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ధత్వాలియాకు కరోనా సోకడంతో జాతీయ మీడియా కేంద్రాన్ని మూసి, శానిటైజ్‌ చేయనున్నట్లు పీఐబీ అధికారులు తెలిపారు.

అయితే ధత్వాలియా ఈ మధ్య జరిగిన మంత్రివర్గ సమావేశంలో నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రకాష్‌ జవదేకర్‌లతో కలిసి  పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ లను గుర్తించడంపై అధికారులు దృష్టి సారించారు.