ఆస్ట్రేలియా ప్రధానితో ఆన్ లైన్ మీటింగ్.. పర్ఫెక్ట్ టైమింగ్.. మోదీ

| Edited By: Pardhasaradhi Peri

Jun 04, 2020 | 12:52 PM

భారత-ఆస్ట్రేలియా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి 'వర్చ్యువల్ సమ్మిట్' సరైన సమయంలో జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తో..

ఆస్ట్రేలియా ప్రధానితో ఆన్ లైన్ మీటింగ్.. పర్ఫెక్ట్ టైమింగ్.. మోదీ
Follow us on

భారత-ఆస్ట్రేలియా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ‘వర్చ్యువల్ సమ్మిట్’ సరైన సమయంలో జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తో గురువారం ఆయన ఆన్ లైన్ సమ్మిట్ నిర్వహించారు. ఓ విదేశీ నేతతో మోదీ బైలాటరల్ వర్చ్యువల్ సమ్మిట్ నిర్వహించడం ఇదే మొట్టమొదటిసారి. భారత, ఆస్ట్రేలియా దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయని, విలువలు, ప్రయోజనాలు, జాగ్రఫీని , లక్ష్యాలను పంచుకోవడంతో ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ సమ్మిట్ కి అంగీకరించినందుకు ఆయన మారిసన్ కి కృతజ్ఞతలు  తెలిపారు. మారిసన్ ఈ ఏడాది మొదట్లోనే ఇండియాను విజిట్ చేసి ఉంటే గొప్పగా ఉండేదని, అప్పుడు ఈ వర్చ్యువల్ సమ్మిట్ అంత ప్రాధాన్యత సంతరించుకునేది కాదని మోదీ అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి అదుపులోకి రాగానే మారిసన్ తన ఫ్యామిలీతో సహా  భారత్ ని సందర్శించాలని ఆయన కోరారు.

కాగా-ఇతర అంశాలతో సహా తమతమ మిలిటరీ స్థావరాలను పరస్పరం సన్నిహితంగా ఉంచేందుకు సంబంధించి భారత,ఆస్ట్రేలియా దేశాల మధ్య ఒప్పందం కుదరవచ్ఛునని భావిస్తున్నారు.

ఈ మధ్యే స్కాట్ మారిసన్ చట్నీతో కూడిన సమోసాలను మోదీతో షేర్ చేసుకోవాలని ఉందంటూ సరదాగా ట్వీట్ చేసిన సంగతి విదితమే. ఇందుకు మోదీ కూడా.. ‘కనెక్టెడ్ బై ది ఇండియన్ ఓషన్..యునైటెడ్ బై ది ఇండియన్ సమోసా’ అని అదే స్ఫూర్తితో ఆయనకు ట్వీట్ చేశారు.