అంత్యక్రియలకు వేల మంది హాజరు.. అందులో ఉన్నవారు ఎవరో తెలిస్తే షాక్..

| Edited By:

May 19, 2020 | 5:22 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఈ లాక్‌డౌన్ వేళ పలు ఆంక్షలను కూడా విధించింది. శుభాకార్యాలకు కానీ, అంత్యక్రియలకు కానీ పరిమిత సంఖ్యలోనే హాజరుకావాలని పేర్కొంది. ఎవరైనా చనిపోతే.. అంత్యక్రియలకు కేవలం ఇరవై మంది మాత్రమే పాల్గొనాలని సూచించింది. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం ఓ ఆధ్యాత్మిక వేత్త మరణిస్తే.. ఆయన అంత్యక్రియలకు వేల మంది హాజరయ్యారు.లాక్‌డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా.. పెద్ద […]

అంత్యక్రియలకు వేల మంది హాజరు.. అందులో ఉన్నవారు ఎవరో తెలిస్తే షాక్..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఈ లాక్‌డౌన్ వేళ పలు ఆంక్షలను కూడా విధించింది. శుభాకార్యాలకు కానీ, అంత్యక్రియలకు కానీ పరిమిత సంఖ్యలోనే హాజరుకావాలని పేర్కొంది. ఎవరైనా చనిపోతే.. అంత్యక్రియలకు కేవలం ఇరవై మంది మాత్రమే పాల్గొనాలని సూచించింది. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం ఓ ఆధ్యాత్మిక వేత్త మరణిస్తే.. ఆయన అంత్యక్రియలకు వేల మంది హాజరయ్యారు.లాక్‌డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా.. పెద్ద ఎత్తున రాజకీయ నాయకులతో పాటుగా.. పలువురు బాలీవుడ్ స్టార్లు, స్థానిక ప్రజలు హాజరయ్యారు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఆధ్మాత్మికవేత్త దాదాజీగా సుపరిచితుడైన దేవ్‌ ప్రభాకర్‌ శాస్త్రి.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు రాష్ట్రంలోని కట్నిలో.. పూర్తి అధికార లాంఛనాలతో జరిగాయి. అయితే ఈ అంత్యక్రియల్లో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా.. కనీసం సోషల్ డిస్టెన్స్ కూడా పాటించలేదు అక్కడి ప్రజలు. అయితే ఈ అంతిమ యాత్రలో స్థానిక బీజేపీ నేతలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు. మంత్రులు, మాజీ మంత్రులు, బాలీవుడ్ నటులు కూడా హాజరయ్యారు. అయితే దీనిపై అక్కడి అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదని సమాచారం. అటు కాంగ్రెస్ నేతలు కూడా దీనిపై ఎక్కువగా స్పందించనప్పటికీ.. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, మాజీ మంత్రి మాత్రం లాక్‌డౌన్ నిబంధనలు పాటించాల్సిందన్నారు.