కేటీఆర్ విన్నపం.. ‘ఎస్‌ బ్రదర్’ అన్న పవన్..!

| Edited By:

Mar 26, 2020 | 10:05 PM

కరోనాపై ప్రపంచం మొత్తం ఇప్పుడు యుద్దం చేస్తున్నారు. ఈ మహమ్మారికి ఎలాగైనా విరుగుడు కనిపెట్టి.. ఆట కట్టించాలని శాస్త్రవేత్తలు సైతం ప్రయోగాలను ముమ్మరం చేశారు.

కేటీఆర్ విన్నపం.. ఎస్‌ బ్రదర్ అన్న పవన్..!
Follow us on

కరోనాపై ప్రపంచం మొత్తం ఇప్పుడు యుద్దం చేస్తున్నారు. ఈ మహమ్మారికి ఎలాగైనా విరుగుడు కనిపెట్టి.. ఆట కట్టించాలని శాస్త్రవేత్తలు సైతం ప్రయోగాలను ముమ్మరం చేశారు. ఇక దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై పలు కఠిన చర్యలు తీసకుంటున్నాయి. మరోవైపు కరోనాపై యుద్ధానికి విరాళాలు ఇచ్చి తమవంతు సహాయం చేస్తున్నారు పలువురు ప్రముఖులు. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న కృషిపై జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ ప్రశంసలు కురిపించారు.

ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసిన పవన్.. థ్యాంక్యు కేటీఆర్ సర్.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వంలో మీరు చేస్తోన్న అద్భుత కృషికి కంగ్రాట్స్ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. థ్యాంక్స్‌ అన్నా అని పెట్టి.. ఎప్పటి నుంచి మీరు నన్ను సర్ అని పిలుస్తున్నారు. ఎప్పటికీ బ్రదర్ అని పిలవండి అని కామెంట్ పెట్టారు. అందుకు పవన్ మరోసారి స్పందిస్తూ యస్‌ బ్రదర్ అని రిప్లై ఇచ్చారు. కాగా కరోనాపై యుద్ధం నేపథ్యంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ విరాళం ఇచ్చారు. కేంద్రానికి కోటి రూపాయాలు.. రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.50లక్షలను విరాళంగా అందించనున్నారు పవన్.

Read This Story Also: కరోనా సహాయనిధి.. విరాళాలు ఇచ్చే వారికి గుడ్‌న్యూస్‌..!