పాక్‌లో కరోనా విళయ తాండవం…కొత్తగా నమోదైన కేసులు చూస్తే షాక్..

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముప్పై ఏడు లక్షల మందికి కరోనా సోకగా.. వీరిలో పన్నెండు లక్షల మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక మరో రెండున్నర లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 నాలుగు గంటల్లో కొత్తగా మరో 1523 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని […]

పాక్‌లో కరోనా విళయ తాండవం...కొత్తగా నమోదైన కేసులు చూస్తే షాక్..

Edited By:

Updated on: May 07, 2020 | 9:25 PM

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముప్పై ఏడు లక్షల మందికి కరోనా సోకగా.. వీరిలో పన్నెండు లక్షల మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక మరో రెండున్నర లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా కరోనా మహమ్మారి
విజృంభిస్తోంది. గడిచిన 24 నాలుగు గంటల్లో కొత్తగా మరో 1523 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ అధికారులు ప్రకటించారు. గురువారం నమోదైన కేసులతో దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 24 వేలకు దాటింది. ఇక గత 24 గంటల్లో కరోనా బారినపడి మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం మరణాల
సంఖ్య 564కు చేరింది. అయితే పాక్‌లో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా సింధ్ ప్రావిన్స్‌తో పాటు.. పంజాబ్‌, ఖైబర్‌ ప్రావిన్స్‌, బలుచిస్తాన్‌ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి.