పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కరోనా మహమ్మారి..

| Edited By: Pardhasaradhi Peri

Apr 12, 2020 | 3:57 PM

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికిస్తోంది. ఇప్పటికే లక్ష మందికి పైగా దీని బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక మన పొరుగుదేశం పాకిస్థాన్‌లో కూడా ఇది క్రమక్రమంగా విజృంభిస్తోంది. ఇప్పటికే పాక్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5వేలకు దాటినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో సగానికి పైగా.. పంజాబ్ ప్రావిన్స్‌లోనే నమోదయ్యాయి. దీంతో దేశంలో అక్కడ కూడా లాక్‌డౌన్‌ పొడిగించాలని పాక్‌ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ ప్రోవిన్స్‌లో ముఖ్యంగా.. ఖైబర్ పక్తుంఖ్వా ఏరియాలో ఈ […]

పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కరోనా మహమ్మారి..
Follow us on

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికిస్తోంది. ఇప్పటికే లక్ష మందికి పైగా దీని బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక మన పొరుగుదేశం పాకిస్థాన్‌లో కూడా ఇది క్రమక్రమంగా విజృంభిస్తోంది. ఇప్పటికే పాక్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5వేలకు దాటినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో సగానికి పైగా.. పంజాబ్ ప్రావిన్స్‌లోనే నమోదయ్యాయి. దీంతో దేశంలో అక్కడ కూడా లాక్‌డౌన్‌ పొడిగించాలని పాక్‌ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

పంజాబ్ ప్రోవిన్స్‌లో ముఖ్యంగా.. ఖైబర్ పక్తుంఖ్వా ఏరియాలో ఈ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైనట్లు పాక్ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 10వ తేదీన డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసిన లెక్కల ప్రకారం.. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో 2,425 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. అందులో పక్తుంఖ్యా ప్రాంతంలోనే 620 కేసులున్నట్లు గుర్తించింది. పాజిటివ్ వచ్చిన బాధితులు.. 201 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. 181 మందికి ప్రాణాపాయం లేదని.. అయితే.. 20 మంది పరిస్థితి మాత్రం బాగులేదని వైద్యాధికారులు తెలిపారు. ఇక ఈ ప్రావిన్స్‌లోనే కరోనా పాజిటివ్‌తో 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాక్ అధికారులు వెల్లడించారు. ఇక పంజాబ్‌ ప్రావిన్స్‌ తర్వాత.. సింధ్ ప్రావిన్స్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు దేశంలో కరోనా పరీక్షలు చేసేందుకు కావాల్సిన వైద్య సదుపాయం లేకపోవడంతో.. రిపోర్టులు ఆలస్యంగా వస్తుండటంతో.. ఇంకా ఎన్ని పాజిటివ్‌ కేసులు బయటపడతాయోనని.. ఇమ్రాన్‌ ప్రభుత్వం వణికిపోతోంది.