కరోనాకు భయపడకండి.. మసీదులకు పోటెత్తండి.. ఇమామ్‌ల పిలుపు..

|

Apr 25, 2020 | 10:40 AM

రంజాన్ వేళ కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో ముస్లింలందరూ కూడా ఇళ్లలోనే ప్రార్ధనలు చేయాలని అనేక దేశాల ప్రభుత్వాలు, ముస్లిం మత పెద్దలు సూచించిన సంగతి తెలిసిందే. అటు ముస్లింలు ఎక్కువగా ఉండే ఇస్లామిక్ దేశాల్లో కూడా మసీదులను మూసివేయడం గమనార్హం. అయితే పాకిస్తాన్‌లో కొంతమంది ఇమామ్‌లు మాత్రం ప్రభుత్వం విధించిన నిబంధనలను బేఖాతరు చేసి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రార్ధనల నిమిత్తం మసీదులకు రావాలని కోరుతున్నారు. పాకిస్తాన్‌లో కరోనా కోరలు చాస్తోంది. ఈ […]

కరోనాకు భయపడకండి.. మసీదులకు పోటెత్తండి.. ఇమామ్‌ల పిలుపు..
Follow us on

రంజాన్ వేళ కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో ముస్లింలందరూ కూడా ఇళ్లలోనే ప్రార్ధనలు చేయాలని అనేక దేశాల ప్రభుత్వాలు, ముస్లిం మత పెద్దలు సూచించిన సంగతి తెలిసిందే. అటు ముస్లింలు ఎక్కువగా ఉండే ఇస్లామిక్ దేశాల్లో కూడా మసీదులను మూసివేయడం గమనార్హం. అయితే పాకిస్తాన్‌లో కొంతమంది ఇమామ్‌లు మాత్రం ప్రభుత్వం విధించిన నిబంధనలను బేఖాతరు చేసి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రార్ధనల నిమిత్తం మసీదులకు రావాలని కోరుతున్నారు. పాకిస్తాన్‌లో కరోనా కోరలు చాస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీనికి కొంతమంది మతాధికారులు కట్టుబడి ఉన్నా.. మరికొందరు మాత్రం శుక్రవారం నాటి ప్రార్ధనలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఇక వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా దాడి చేశారు.

రంజాన్ మాసంలో మసీదులపై లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలని కొంతమంది మతాధికారులు, మత పార్టీల నాయకులు, ఇమామ్‌లు ఓ లేఖపై సంతకాలు చేశారు. మసీదులు తెరిపిస్తారా? లేదా దేవుడి ఆగ్రహానికి గురవుతారా? అంటూ అల్టిమేటం జారీ చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం ఓ అగ్రిమెంట్‌ను విడుదల చేసింది. రంజాన్ మాసంలో మసీదులు తెరిచే ఉంటాయని.. కానీ తప్పకుండా ప్రభుత్వం విధించిన రూల్స్‌ను పాటించాలని తెలిపింది. మసీదుల్లో ఒక్కొక్కరి మధ్య 6 అడుగుల దూరం ఉండాలి. అంతేకాక ఎవరి చాపలు వాళ్ళే తెచ్చుకోవాలి. చేతులు, కాళ్లు ఇంటి వద్దే కడుక్కోవాలని ప్రభుత్వం సూచించింది. కాగా, జాతీయ సంక్షోభం నెలకొన్న సమయంలో ప్రభుత్వంపై ఇమామ్‌లు ఇలా పెత్తనం చెలాయిస్తారా.? అంటూ ఇస్లామాబాద్‌కు చెందిన హసనుల్ అమీన్ అనే ప్రొఫెసర్ ప్రశ్నించారు.

ఇవి చదవండి:

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి.. ముస్లింలకు ఓవైసీ విజ్ఞప్తి..

కరోనా ముస్లిం పేషంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..