Pakistan Approves Sinopharm: అత్యవసర పరిస్థితిల్లో వినియోగానికి చైనా వ్యాక్సిన్ కు అనుమతిలిచ్చిన పాకిస్థాన్

|

Jan 19, 2021 | 11:39 AM

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఐరోపా దేశాలతో పాటు, అమెరికా, అరబ్, చైనా వంటి అనేక దేశాలు టీకాలను..

Pakistan Approves  Sinopharm: అత్యవసర పరిస్థితిల్లో వినియోగానికి చైనా వ్యాక్సిన్ కు అనుమతిలిచ్చిన పాకిస్థాన్
Follow us on

Pakistan Approves Sinopharm: ప్రపంచ దేశాలు కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఐరోపా దేశాలతో పాటు, అమెరికా, అరబ్, చైనా వంటి అనేక దేశాలు టీకాలను ఇస్తున్నాయి. తాజాగా చైనా కు చెందిన సినో ఫార్మ్ కోవిడ్ వ్యాక్సిన్ ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి పాకిస్థాన్ రెడీ అయ్యింది. ఈమేరకు సోమవారం డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్థాన్ ఆమోదం తెలిపింది. గత శుక్రవారం ఆ దేశం లోని ఆక్స్‌ఫ‌ర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాకిస్తాన్‌లో అధికారికంగా కరోనా నివారణకు రెండో వ్యాక్సిన్లకు ఆమోదం లభించింది.

ఈ రెండు వ్యాక్సిన్ల సామ‌ర్థ్యాన్ని ప‌రిశీలించిన త‌ర్వాత అనుమ‌తి ఇచ్చామని రెగ్యులేట‌రీ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి మూడు నెల‌ల‌కోసారి ఈ వ్యాక్సిన్ల భద్రత సామ‌ర్థ్యం, ప్రభావంపై సమీక్ష జ‌రుపుతామ‌ని చెప్పింది. సినోఫార్మ్‌ను బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ‌యోలాజిక‌ల్ ప్రోడ‌క్ట్స్ అభివృద్ధి చేసింది. త‌మ వ్యాక్సిన్ సామ‌ర్థ్యాన్ని 79.3 శాతంగా ఆ కంపెనీ చెబుతోంది. మరో వైపు చైనా సినో ఫార్మ్ వ్యాక్సిన్ కు వినియోగానికి యూఏఈ, బ‌హ్రెయిన్ లు కూడా అనుమతిలిచ్చాయి. అయితే నేపాల్.. చైనా కు షాక్ ఇస్తూ టీకా కోసం భారత్ వైపు చూస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:  తెలంగాణలో జోరందుకున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ.. టీకా కేంద్రాలు వెయ్యికి పెంపు..