India: కరోనా సెకండ్ వేవ్.. భారత్‌కు 40 దేశాల సాయం.. విదేశాంగ శాఖ ప్రకటన..

| Edited By: Ram Naramaneni

May 21, 2021 | 9:25 AM

MEA - Red Cross Society: దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. సెకండ్ వేవ్ ఉధృతితో నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో

India: కరోనా సెకండ్ వేవ్.. భారత్‌కు 40 దేశాల సాయం.. విదేశాంగ శాఖ ప్రకటన..
Mea Spokesperson Arindam Bagchi
Follow us on

MEA – Red Cross Society: దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. సెకండ్ వేవ్ ఉధృతితో నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో ఇటీవల ఆక్సిజన్, వైద్య పరికరాలు లేక భారత్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ అందక వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో విపత్కర పరిస్థితులను చూసి భారత్‌కు చేయూతనందించేందుకు చాలా దేశాలు ముందుకొచ్చాయి. వైద్య పరికరాలు, సామాగ్రిని అందించి కష్టకాలంలో మేమున్నామంటూ ఆపన్నహస్తం అందించాయి. అయితే.. ఈ విపత్కర పరిస్థితుల్లో దాదాపు 40 దేశాలు కోవిడ్ సంబంధిత పరికరాలు, సామాగ్రిని భారత్‌కు పంపించాయని కేంద్ర విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈ ఎగుమతులు జరిగాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు. కోవిడ్‌పై పోరాడుతున్న క్రమంలో చాలా దేశాలు భారత్‌కు సంఘీభావం తెలపడానికి, మద్దతివ్వడానికి ముందుకు వచ్చి సాయం చేశాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా 40 దేశాలు భారత్‌కు కోవిడ్‌పై పోరాడడానికి అవసరమైన సామాగ్రిని, పరికరాలను పంపాయని అరిందమ్ బాగ్చి మీడియాకు వెల్లడించారు.

కాగా దేశంలో కరోనా కేసుల ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. గురువారం 2,76,110 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,57,72,440 కి పెరిగింది.

Also Read:

చేతి గోళ్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందా..? పొడవాటి గోళ్లతో అనారోగ్య సమస్యలు వస్తాయా..! అసలు నిజాలు తెలుసుకోండి..

దేశంలో ఇంకా మాస్కులు ధరించని 50 శాతం మంది….కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన, కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితిపై కలవరం