బెంగుళూరులో 3 వేల మంది కరోనా పాజిటివ్ వ్యక్తులు ‘మిస్సింగ్’ !

బెంగుళూరులో కరోనా ఇన్ఫెక్షన్ సోకిన 3,338 మంది వ్యక్తుల ఆచూకీ కనబడడం లేదు. వీరి జాడ కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఒక్కనగరంలోనే కరోనా వైరస్ కేసులు దాదాపు 27 వేలకు పెరిగిపోయాయి. రెండు వారాల క్రితం..

బెంగుళూరులో 3 వేల మంది కరోనా పాజిటివ్ వ్యక్తులు మిస్సింగ్ !

Edited By:

Updated on: Jul 26, 2020 | 10:34 AM

బెంగుళూరులో కరోనా ఇన్ఫెక్షన్ సోకిన 3,338 మంది వ్యక్తుల ఆచూకీ కనబడడం లేదు. వీరి జాడ కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఒక్కనగరంలోనే కరోనా వైరస్ కేసులు దాదాపు 27 వేలకు పెరిగిపోయాయి. రెండు వారాల క్రితం ఈ సంఖ్య 16 వేలు మాత్రమే.. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో  సుమారు సగం బెంగుళూరులోని కేసులేనని అధికారులు వెల్లడించారు. కోవిడ్-19 రోగుల్లో కూడా చాలామంది పత్తా లేకుండా పోయారని వారు చెప్పారు. అనేకమంది తప్పుడు చిరునామాలు, తప్పుడు ఫోన్ నెంబర్లు ఇచ్చారని, వారి ఆచూకీ కనుగొనడానికి పోలీసుల సాయం తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు.   ఇలాంటి వ్యక్తుల కారణంగా కరోనా వైరస్ మరింత వ్యాపిస్తుందని ఆందోళన చెందుతున్నారు.