ఫ్లాష్ న్యూస్: ఒకరికి కాదు.. భార్యభర్తలిద్దరీ కరోనానే!

| Edited By:

Mar 03, 2020 | 9:31 PM

తాజాగా భారత్‌లో మరో కేసు నమోదైంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో కరోనా కేసు నమోదయ్యింది. కరోనా వైరస్ సోకిన వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు..

ఫ్లాష్ న్యూస్: ఒకరికి కాదు.. భార్యభర్తలిద్దరీ కరోనానే!
Follow us on

ప్రస్తుతం తాజాగా భారత్‌లోని మరో కేసు నమోదైందని.. రాజస్థాన్ ప్రభుత్వం తెలుపగా.. అది ఒకరికి మాత్రమే కాదు.. ఇటలీ నుంచి జైపూర్‌ వచ్చిన భార్యాభర్తలిద్దరికీ సోకిందని తాజాగా వెల్లడించింది. అయితే కరోనా వైరస్ సోకిన వీరిని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు.. రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు రాజస్థాన్ అధికారులు తెలిపారు. వీరు ఇటలీ దేశానికి చెందినవారని.. జైపూర్‌లో పర్యటించడానికి భారత్‌కి వచ్చినట్లు రాజస్థాన్ అధికారులు తెలిపారు. ఇప్పుడు ఈ కేసులో కరోనా భారిన పడిన వారి సంఖ్య 8కు చేరింది. ఏదేమైనా.. ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా, ధైర్యంగా ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ముఖ్యంగా కళ్లు, ముక్కు, నోటిని.. చేతులతో తాకడం తగ్గించాలంటూ సోషల్ మీడియా వేధికగా కొన్ని సూచనలు కూడా చేశారు ప్రధాని.

కాగా.. చైనాలో పుట్టి.. ఆ దేశాన్ని గడగడలాడించిన కరోనా వైరస్.. ప్రస్తుతం అక్కడ తగ్గుముఖం పట్టింది. అయితే క్రమంగా ఇతర దేశాలను వణికిస్తోంది. తాజాగా ఇండియాలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ వ్యక్తికి వైరస్‌ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పుడు మరో రెండు కేసులతో నెంబర్ 4కి చేరింది. ప్రపంచమంతా విస్తరించిన ఈ వైరస్‌ బారినపడి మూడువేల మందికిపైగా చనిపోయారు. అరవై ఏళ్ల పైబడి బలహీనంగా ఉన్నవారికి ఇది సోకుతోందని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ చెబుతోంది. ఇప్పుడు అమెరికా, యూరప్‌తో సహా అనేక దేశాలలో తొలికేసులూ, తొలి మరణాలూ నమోదవుతున్నాయి.