అంత్యక్రియలు ముగిసిన తరువాత ఇంటికొచ్చిన వృద్ధురాలు.. వైద్య సిబ్బంది నిర్వాకం వల్లే.. అసలేమైందంటే..?

|

Jun 02, 2021 | 6:07 PM

vijayawada govt hospital: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. వేరే మహిళ మృతదేహాన్నిసిబ్బంది అప్పగించడంతో.. ఓ కుటుంబం

అంత్యక్రియలు ముగిసిన తరువాత ఇంటికొచ్చిన వృద్ధురాలు.. వైద్య సిబ్బంది నిర్వాకం వల్లే.. అసలేమైందంటే..?
Old Women
Follow us on

vijayawada govt hospital: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. వేరే మహిళ మృతదేహాన్నిసిబ్బంది అప్పగించడంతో.. ఓ కుటుంబం అంత్యక్రియలు సైతం నిర్వహించింది. ఆమె జ్ఞాపకాల నుంచి ఆ మహిళ కుటుంబం ఇంకా తేరుకోకముందే.. సరిగ్గా 18 రోజులకు ఆ మహిళ తిరిగివచ్చింది. ఈ షాకింగ్ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని క్రిష్టియన్ పేటలో చోటుచేసుకుంది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జగ్గయ్యపేటకు చెందిన ముత్యాల గిరిజమ్మ కరోనాతో మే 12న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. 15న గిరిజమ్మ మృతిచెందిందని.. ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది భర్త గడ్డయ్యకు అప్పగించారు. గడ్డయ్య కుటుంబసభ్యులు ఆ మృతదేహానికి అంత్యక్రియలు సైతం నిర్వహించారు.

ఈ క్రమంలో గిరిజమ్మ (జూన్ 2) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి బుధవారం ఇంటికి చేరింది. ఇప్పటివరకూ శోకసంద్రంలో మునిగిన కుటుంబసభ్యులు, స్థానికులు గిరిజమ్మను షాక్‌కు గురయ్యారు. ప్రభుత్వాస్పత్రి నిర్లక్ష్యంపై కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. ఎవరు చనిపోయారో నిర్థారించకుండా ఎలా అప్పగిస్తారంటూ గిరిజమ్మ భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు గిరిజమ్మ తిరిగి రావడంతో గడ్డయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. మే 23న గడ్డయ్య, గిరిజమ్మ కొడుకు రమేష్‌ కరోనాతో ఖమ్మం ఆసుపత్రిలో మృతిచెందాడు. తల్లి మరణించిన వారానికే కొడుకు మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే.. గిరిజమ్మ తిరిగిరావడంతో ఆ కుటుంబానికి కొంత ఉపశమనం లభించినట్లయింది. అయితే.. కొడుకుని తలచుకుని భార్తభర్తలిద్దరూ కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read:

Doctor Assault: కోవిడ్ కేర్ సెంటర్‌లో యువ వైద్యుడిపై దాడి.. 24 మంది అరెస్ట్.. వీడియో

స్మోకింగ్ తో కోవిద్ కి లింక్ ! పొగ రాయుళ్లూ ! బీ అలర్ట్ అంటున్న మీరట్ డాక్టర్లు , ముంచుకొస్తున్న థర్డ్ వేవ్ తో కూడా ముప్పే అంటూ హెచ్చరికలు