తెలంగాణ నుంచి వెళ్లాల‌నుకునే వారికి ..ఆన్‌లైన్‌లో ఈ-పాస్

|

May 04, 2020 | 6:48 AM

now you can apply for e-pass in online if you want go beyond telangana state

తెలంగాణ నుంచి వెళ్లాల‌నుకునే వారికి ..ఆన్‌లైన్‌లో ఈ-పాస్
Follow us on
స్వస్థలాలకు వెళ్లాలనే కోరికను నలభైరోజులుగా అణుచుకున్న ఇతర రాష్ట్రాల వారు ఇప్పుడు ప్ర‌యాణికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.. లాక్‌డౌన్‌ కారణం గా ఉపాధి కోల్పోయిన కార్మికులతోపాటు, ఇతర  రాష్ట్రాల నుంచి  వచ్చి చిక్కుకుపోయినవారుసైతం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం  అందుకు త‌గిన ఏర్పాట్లు చేస్తోంది.

ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎవరైనా… తెలంగాణలో ఉండిపోయి… తమ రాష్ట్రాలకు వెళ్లలేకపోతే… ఇప్పుడు వారు… ఈ-పాస్ (E-PASS) కోసం అప్లై లో చేసుకోవచ్చని రాష్ట్ర పోలీసు శాఖ వెల్ల‌డించింది. అందుకు సంబంధించిన సమాచారాన్ని ఈ-పాస్ సైట్‌ (https://tsp.koopid.ai/epass)లోకి వెళ్లి చూడవచ్చన్నారు. అలాగే… ఈ-పాస్ కోసం సైట్‌లోనే అప్లై చేసుకోవచ్చని తెలిపారు. అప్లై చేసుకోవడానికి కొంత సమాచారం ఎంటర్ చెయ్యాల్సి ఉంటుందన్న పోలీసులు… అలా వచ్చిన దరఖాస్తులను తాము పరిశీలించి… అంతా సక్రమంగా ఉంటే… ఈ-పాస్ జారీ చేస్తామని చెప్పారు. దరఖాస్తు చేసుకున్నవారందరికీ వీలైనంత త్వరగా ఈ-పాస్‌లు జారీచేస్తున్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదివారం ట్విట్టర్‌లో తెలిపారు. ఒక్కరోజులోనే 12వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. వీరిలో 7,749 మందికి ఈ-పాస్‌లు జారీచేసినట్టు పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్‌కు ఒక్కరోజులోనే లక్షా20వేల హిట్స్‌ వచ్చినట్టు ఆయ‌న పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, ప్రయాణాలతో కరోనా వ్యాప్తిచెందే అవకా శం ఎక్కువగా ఉంటుందని, పొరుగురాష్ట్రాల్లో ఉ న్నవారు అక్కడే ఉండాలని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. వలసకూలీలకు మాత్రమే రాష్ట్రంలో అనుమ‌తి ఉంద‌ని, ఇతరులు సరిహద్దులకు వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు.