Corona Virus Pandemic: దేశంలో ఓ వైపు కరోనా కల్లోలం.. సేఫ్‌జోన్‌లో ఉన్న ఈ పది ప్రాంతాలు..

Corona Virus Pandemic: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో రోజు రోజుకీ భారీగా కేసులు నమోదవుతున్నాయి. గత పది రోజులుగా..

Corona Virus Pandemic: దేశంలో ఓ వైపు కరోనా కల్లోలం.. సేఫ్‌జోన్‌లో ఉన్న ఈ పది ప్రాంతాలు..
Covid 19

Updated on: Apr 17, 2021 | 7:50 AM

Corona Virus Pandemic: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో రోజు రోజుకీ భారీగా కేసులు నమోదవుతున్నాయి. గత పది రోజులుగా లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు కూడా రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. భారీ సంఖ్యలో కేసులు నమోదవడంతో మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్ గడ్, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

అయితే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో రోజువారి కేసుల సంఖ్య అతితక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉందని చెప్పవచ్చు. లడఖ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో తక్కువ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు గత రెండు రోజులుగా ఒక్క మరణం కూడా నమోదుకాలేదు. దేశంలో ఈ పది ప్రాంతాలు .. ప్రస్తుతానికి సేఫ్ జోన్ లో ఉన్నాయని చెప్పవచ్చు.

Also Read: ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తాగితే కలిగే ప్రయోజనాలు తెలుసా..!

ప్రముఖ కమెడియన్ ‘వివేక్’ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ