కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో లోపాలు ఒక్కోటి బయటపడుతున్నాయి. తాజాగా నోయిడాకు చెందిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురయ్యింది. వ్యాక్సిన్ తీసుకోకుండానే ఆయన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందాడు. ఈ విషయాన్ని స్వయంగా 43 ఏళ్ల విపిన్ జైన్ మీడియాకు వెల్లడించారు. అయితే ఆయన అడ్డదారిలో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొంది ఉండొచ్చని భావిస్తే మీరు తప్పులో కాలేసినట్లే. ప్రభుత్వ సెంటర్‌లో స్లాట్ బుక్ చేసుకున్న జైన్…వ్యాక్సిన్ వేస్తున్న పారామెడిక్ సిబ్బందికి తాను ఏప్రిల్ మాసంలో కొవిడ్ బారినపడినట్లు తెలిపారు. అయితే అదే నెల 20న తనకు కొవిడ్ నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తెలియజేశారు.
అయితే కొవిడ్ బారినపడిన వ్యక్తులు వ్యాక్సిన్ వేసుకోవాలంటే మరో మూడు మాసాలు ఆగాలని చెప్పిన పారామెడికల్ సిబ్బంది…జులై 20 తర్వాతే వ్యాక్సిన్ వేసుకోవాలని జైన్‌కు సూచించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల గురించి ఆయనకు వివరించారు. దీంతో వ్యాక్సిన్ వేసుకోకున్నా ఆయనకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ జారీ అయ్యింది. కొవిన్ యాప్‌లో స్టేటస్‌ను అప్‌డేట్ చేయడం తమకు సాధ్యంకాదని…హెల్ప్ లైన్‌కు కాల్ చేయాలని వ్యాక్సినేషన్ సెంటర్ అధికారులు సూచించారు. ఈ విషయమై జైన్ కోవిన్ హెల్ప్ లైన్‌కు కాల్ చేయగా…వ్యాక్సినేషన్ స్టేటస్‌లో మార్పులు చేయడం సాధ్యంకాదని సమాధానమిచ్చారు. మొదటి వ్యాక్సిన్ కోసం ఆయన మరో మొబైల్ నెంబర్, మరో గుర్తింపు కార్డుతో కోవిన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని కొవిన్ హెల్ప్ లైన్ సిబ్బంది సలహా ఇచ్చారు.
Covid Vaccine
దీనిపై స్పందించిన అధికారులు…వ్యాక్సినేషన్ కోసం స్లిప్ తీసుకున్న వ్యక్తి తప్పనిసరిగా డోస్ తీసుకుంటారని పేర్కొన్నారు. జైన్ వ్యాక్సిన్ తీసుకోకుండానే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను పొందడం అరుదైన ఘటనగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
సరస్సులోకి దిగిన టూరిస్టులు.. వారిపైకి దూసుకొచ్చిన నీటి ఏనుగు.. చివరికి ట్విస్ట్ ఏంటంటే?
కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్‌తోనే చెక్.. ఇప్పటివరకు ఎంతమందికి టీకా అందిందంటే..?