కేంద్రం కీలక నిర్ణయం: కొత్త పథకాలపై నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన

|

Jun 05, 2020 | 3:30 PM

కరోనా, లాక్‌డౌన్ భూమిపై అనేక మార్పులు తెచ్చింది. మరోవైపు దేశాల ఆర్థిక స్థితిగతులను సైతం చిన్నాభిన్నం చేసింది. భారత్‌లోనూ కోవిడ్ -19 పంజా ధాటికి అన్ని వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేశారు. ఒక ఏడాది పాటు..

కేంద్రం కీలక నిర్ణయం: కొత్త పథకాలపై నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన
Follow us on

కరోనా, లాక్‌డౌన్ భూమిపై అనేక మార్పులు తెచ్చింది. మరోవైపు దేశాల ఆర్థిక స్థితిగతులను సైతం చిన్నాభిన్నం చేసింది. భారత్‌లోనూ కోవిడ్ -19 పంజా ధాటికి అన్ని వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేశారు. ఒక ఏడాది పాటు కొత్తగా ఎలాంటి పథకాలను ప్రారంభించబోమని నిర్మాలా సీతారామన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇతర పథకాలపై ఖర్చులు తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త పథకాల నిధుల కోసం అభ్యర్థనలు పంపవద్దని ఇప్పటికే అన్ని శాఖలకు తెలియజేశామని వెల్లడించారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీల ద్వారా మాత్రమే నిధులను ఖర్చు చేస్తామని తెలిపారు. కరోనా నేపథ్యంలో నిధులకు సంబంధించి ప్రాధాన్యతలు మారిపోతున్నాయని…అవసరమైన వాటికే నిధులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఒకవేళ తాజా నిబంధనలకు విరుద్ధంగా నిధులను కేటాయించాల్సి వస్తే.. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్( ఖర్చుల శాఖ) అనుమతి తీసుకోవాలని అన్నారు.