తెలుగు ప్రజలకు భారీ షాక్ ఇచ్చిన బ్యాంకులు..! ఇక కట్టాల్సిందేనా..?

| Edited By:

Apr 01, 2020 | 6:06 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెజార్టీ ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దాదాపు అన్ని వ్యాపారాలు, కంపెనీలు, పరిశ్రమలు మూతపడ్డాయి. అత్యవసర సర్వీసులు మినహా.. మిగతా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇచ్చి ఉద్యోగులతో పనులు చేయిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మందికి వ్యాపారాలు లేక.. ఇంటికే పరిమితమవ్వడంతో..డబ్బులు లేకుండా పోయాయి.ఇక ప్రతి నెల ఒకటో తేదీ వస్తే చాలు.. ఎంతో మందికి హోం లోన్స్, […]

తెలుగు ప్రజలకు భారీ షాక్ ఇచ్చిన బ్యాంకులు..! ఇక కట్టాల్సిందేనా..?
Follow us on

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెజార్టీ ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దాదాపు అన్ని వ్యాపారాలు, కంపెనీలు, పరిశ్రమలు మూతపడ్డాయి. అత్యవసర సర్వీసులు మినహా.. మిగతా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇచ్చి ఉద్యోగులతో పనులు చేయిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మందికి వ్యాపారాలు లేక.. ఇంటికే పరిమితమవ్వడంతో..డబ్బులు లేకుండా పోయాయి.ఇక ప్రతి నెల ఒకటో తేదీ వస్తే చాలు.. ఎంతో మందికి హోం లోన్స్, పర్సనల్ లోన్స్, వెహికిల్ లోన్స్‌తో పాటు.. క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాల్సి ఉంటుంది. అయితే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ బ్యాంకులకు మూడు నెలల పాటు ఈఎంఐ కట్టాల్సిన పనిలేకుండా.. మారిటోరియం ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ మారిటోరియం అమలు కావడం లేదు.

మూడు నెలల పాటు ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదని కేంద్రం ఇచ్చిన ఆదేశాలు ఎక్కడ కూడా అమలు కావడం లేదు. క్రెడిట్ కార్డ్ బిల్లులు కూడా యథావిధిగా కట్టాలంటూ బ్యాంకుల నుంచి మెసెజ్‌లు వస్తున్నాయని పలువురు కస్టమర్లు వాపోతున్నారు. అయితే ఇంకా తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని పలు బ్యాంకుల సిబ్బంది చెబుతున్నారట. ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ సమయంలో మధ్యతరగతి ప్రజలంతా మారిటోరియంపైనే ఆశలు పెట్టుకున్నారు. అటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా.. మూడు నెలల పాటు ఈఎంఐలు కట్టక్కర్లేదని ప్రకటించడంతో అంతా ఆనందపడ్డారు. కానీ ఒకటో తేదీన ఎప్పటిలాగే లోన్లు కట్టాలని బ్యాంకుల నుంచి మెసేజ్‌లు రావడంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు.

అయితే కొన్న బ్యాంకుల నుంచి సందేశాలు వచ్చినా.. వారి వారి అధికారిక ట్విట్టర్ ఖాతాల్లో మూడు నెలల మారిటోరియంకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే కస్టమర్లు మాత్రం దీనికి సంబంధించిన వివరాలను సదరు బ్యాంకు ద్వారా తెలుసుకుంటే సరిపోతుంది.