ఇండియాలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశలోకి రాలేదని కేంద్రం ప్రకటించింది. కేవలం లోకల్ ఔట్ బ్రేక్స్ (స్థానిక సగటు వ్యాప్తి) మాత్రమే ఉన్నట్టు వెల్లడించింది. రీకవరీ రేటు 62 శాతం ఉందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కాగా- దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7.6 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 25 వేల కేసులు నమోదు కాగా.. 487 మరణాలు సంభవించాయి. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న అయిదు దేశాలతో పోలిస్తే ఇండియాలో ఈ కేసులు తక్కువగా ఉన్నాయని కేంద్రం పేర్కొంది. దేశంలో సామాజిక వ్యాప్తి దశ చేరుకోవచ్ఛునన్న ఊహాగానాలను ప్రభుత్వం ఖండించింది. ఈ విధమైన వదంతులను నమ్మరాదని కోరింది.