ఇంకా కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ.. మారని పరిస్థితి

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని.. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తాజాగా ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ప్రణబ్ హెల్త్ కండీషన్ గురించి వివరించారు వైద్యులు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని..

ఇంకా కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ.. మారని పరిస్థితి

Updated on: Aug 23, 2020 | 12:21 PM

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని.. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తాజాగా ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ప్రణబ్ హెల్త్ కండీషన్ గురించి వివరించారు వైద్యులు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని, అయితే ప్రణబ్ శరీరంలోని కొన్ని ముఖ్యమైన అవయవాలు మాత్రం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు వైద్యులు. కాగా ఈ నెల 10వ తేదీన ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్ ముఖర్జీకి వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో ప్రణబ్‌కు కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో పరిస్థితి విషమించి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.

Read More:

బ్రేకింగ్: సినిమా షూటింగులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి.. ఈ రోజు ఎన్ని కేసులంటే?

Loading...
Unable to load recommendations.
Follow Us