‘నాకు 94 ఏళ్ళు.. అయినా కరోనాను జయించా ‘ !

ఢిల్లీకి సమీపంలోని గౌతమ్ బుధ్ద నగర్లో 632 కరోనా వైరస్ కేసులు ఉన్నాయి. వీటిలో 195 యాక్టివ్ కేసులు. అయితే కరోనా నుంచి 60 మంది రోగులు కోలుకున్నారు. వీరిలో 94 ఏళ్ళ..

నాకు 94 ఏళ్ళు.. అయినా కరోనాను జయించా  !

Edited By:

Updated on: Jun 08, 2020 | 8:03 PM

ఢిల్లీకి సమీపంలోని గౌతమ్ బుధ్ద నగర్లో 632 కరోనా వైరస్ కేసులు ఉన్నాయి. వీటిలో 195 యాక్టివ్ కేసులు. అయితే కరోనా నుంచి 60 మంది రోగులు కోలుకున్నారు. వీరిలో 94 ఏళ్ళ వృధ్ధుడు కూడా ఉన్నారు. ఇందుకు గౌతమ్ బుధ్ద నగర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సుహాస్.. ఆయనను అభినందిస్తూ.. ‘సర్ ! మేము మరింత హార్డ్ వర్క్ చేసేందుకు మమ్మల్ని మోటివేట్ చేశారు’.. అంటూ ట్వీట్ చేశారు. ఇక్కడి ఓ ప్రైవేటు హాస్పిటల్ నుంచి నిన్న పదిమంది డిశ్చార్జ్ అయిన వారిలో ఈ 94 వృధ్ధుడు కూడా ఉన్నారు.