కరోనా అప్‌డేట్ : దేశ వ్యాప్తంగా 38,772 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 443 మంది మృతి..

|

Nov 30, 2020 | 11:10 AM

దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం..

కరోనా అప్‌డేట్ : దేశ వ్యాప్తంగా 38,772 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 443 మంది మృతి..
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 38,772 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 94,31,692కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 443 మంది మృత్యువాత పడ్డారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా 1,37,139 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 4,46,952 యాక్టివ్ కేసులుండగా, 88,47,600 మంది కరోనా బారి నుండి కోలుకుని పూర్తి ఆరోగ్యవంతులుగా ఆస్పత్రుల నుండి డిశ్చార్జి అయ్యారు. ఇక, ఇప్పటి వరకు దేశంలో 14,03,79,976 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఒక్క ఆదివారం రోజే 8,76,173 పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో డిశ్చార్చ్ రేట్ 93.81 శాతంగా ఉండగా, డెత్ రేట్ 1.45 శాతం ఉన్నట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.