నేపాల్‌లో రికార్డ్‌ స్థాయిలో కేసులు నమోదు

| Edited By:

Jun 04, 2020 | 6:23 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే 63 లక్షలకు కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. ఇక మొన్నటి వరకు అత్యల్పంగా నమోదైన దేశాల్లో కూడా ఇప్పుడు అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. అందులో ముఖ్యంగా మన పొరుగు దేశం నేపాల్‌ కూడా ఒకటి. మొన్నటి వరకు అక్కడ కేసుల సంఖ్య వందల్లోనే ఉండగా.. తాజాగా అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేలకు చేరింది. తాజాగా గురువారం నాడు అత్యధికంగా 334 కరోనా పాజిటివ్ కేసులు […]

నేపాల్‌లో రికార్డ్‌ స్థాయిలో కేసులు నమోదు
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే 63 లక్షలకు కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. ఇక మొన్నటి వరకు అత్యల్పంగా నమోదైన దేశాల్లో కూడా ఇప్పుడు అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. అందులో ముఖ్యంగా మన పొరుగు దేశం నేపాల్‌ కూడా ఒకటి. మొన్నటి వరకు అక్కడ కేసుల సంఖ్య వందల్లోనే ఉండగా.. తాజాగా అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేలకు చేరింది. తాజాగా గురువారం నాడు అత్యధికంగా 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 2,634కి చేరింది. ఈ విషయాన్ని నేపాల్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి ఇప్పటి వరకు 10 మంది మరణించగా.. 290 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గురువారం నమోదైన 334 కేసుల్లో 319 మంది పురుషులు ఉండగా..15 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 2,450 మంది పురుషులు ఉండగా,184 మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం నేపాల్ దేశంలో 65 జిల్లాల్లో కరోనా మహమ్మారి వ్యాపించింది.