నేపాల్‌లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు

నేపాల్‌లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో నేపాల్‌ దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 1,016 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నేపాల్‌ వ్యాప్తంగా..

నేపాల్‌లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు

Updated on: Aug 18, 2020 | 9:30 PM

నేపాల్‌లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో నేపాల్‌ దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 1,016 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నేపాల్‌ వ్యాప్తంగా 28,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 17,580 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని హిమాలయన్ టైమ్స్‌ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ఏడుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు నేపాల్‌ వ్యాప్తంగా కరోనా బారినపడి 114 మంది మరణించారు. కాగా, గడిచిన 24 గంటల్లో 13 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో 205 కరోనా పాజిటివ్ కేసులు ఖాట్మండు వ్యాలీలోనే నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Read More :

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

బ్రెజిల్‌లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

Loading...
Unable to load recommendations.
Follow Us