అక్కడ జూలై 22 వరకు లాక్‌డౌన్‌..

| Edited By:

Jun 30, 2020 | 4:48 PM

కరోనా కట్టడిలో లాక్‌డౌన్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే.. అప్పుడు కరోనా వైరస్‌ను దాదాపు కట్టడి చేయవచ్చని..

అక్కడ జూలై 22 వరకు లాక్‌డౌన్‌..
Follow us on

కరోనా కట్టడిలో లాక్‌డౌన్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే.. అప్పుడు కరోనా వైరస్‌ను దాదాపు కట్టడి చేయవచ్చని.. ముఖ్యంగా మాస్క్‌లు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటివి చేయడం ద్వారా.. కరోనా బారినపడకుండా వీలుంటుందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరికొన్ని దేశాల్లో మాత్రం లాక్‌డౌన్‌ మినహాయింపులిస్తూ.. అన్‌లాక్‌ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో మనదేశం కూడా అన్‌లాక్‌ రెండో దశగా వెళ్తోంది. అయితే మన పొరుగు దేశమైన నేపాల్‌ మరికొద్ది రోజులు లాక్‌డౌన్ పొడిగిస్తోంది. జూలై 22వ తేదీ వరకు దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. నేపాల్‌లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం అక్కడ పదమూడు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.