స్టూడెంట్స్ అలర్ట్: నీట్ విద్యార్థులకు డ్రెస్‌కోడ్

|

Sep 09, 2020 | 6:34 PM

వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా ఈనెల 13న నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో పరీక్ష రాసే విద్యార్థులకు కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా నీట్ విద్యార్థులకు ఎన్టీఏ డ్రెస్‌ కోడ్‌ను విధించింది.

స్టూడెంట్స్ అలర్ట్: నీట్ విద్యార్థులకు డ్రెస్‌కోడ్
Follow us on

వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా ఈనెల 13న నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో పరీక్ష రాసే విద్యార్థులకు కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా నీట్ విద్యార్థులకు ఎన్టీఏ డ్రెస్‌ కోడ్‌ను విధించింది. మరోవైపు సంప్రదాయ దుస్తులు ధరించే విద్యార్థులు తనిఖీ కోసం నిర్ధేశించిన సమయం కంటే ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని ప్రకటించింది.

నీట్-2020 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎన్‌టీఏ డ్రెస్‌ కోడ్‌ను విధించింది. ఎన్‌టీఏ గైడ్‌లైన్స్ ప్రకారం పరీక్షకు బూట్లతో అనుమతించరు. లో హీల్స్‌తో ఉన్న శాండల్స్‌ను అనుమతిస్తారు. ఫుల్ స్లీవ్‌లెస్‌లను అనుమతించరు. సంప్రదాయ దుస్తులు అంటే బురఖా లాంటివి ధరించేవారు ముందుగానే పరీక్ష హాలుకు రావాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెకింగ్ చేసి లోనికి అనుమతిస్తారు. అదేవిధంగా అడ్మిట్‌కార్డుతోపాటు వ్యాలిడ్ ఫ్రూప్‌ను తీసుకునిరావాల్సి ఉంటుంది.