‘నమస్తే ట్రంప్’ వల్లే కరోనా వైరస్ వ్యాప్తి’.. శివసేన నేత సంజయ్ రౌత్ ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

May 31, 2020 | 5:11 PM

గుజరాత్ (అహమ్మదాబాద్) లో గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఆహ్వానించేందుకు నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ ఈవెంట్ వల్లే ఆ రాష్ట్రంతో బాటు ముంబై, ఢిల్లీ నగరాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఆ సమయంలో ట్రంప్ వెంట వఛ్చిన కొన్ని ప్రతినిధి బృందాలు ఈ నగరాలను విజిట్ చేశాయన్నారు. నమస్తే ట్రంప్ కార్యక్రమం సందర్భంగా గుజరాత్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కాలేదా అని ఆయన […]

నమస్తే ట్రంప్ వల్లే కరోనా వైరస్ వ్యాప్తి.. శివసేన నేత సంజయ్ రౌత్ ఫైర్
Follow us on

గుజరాత్ (అహమ్మదాబాద్) లో గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఆహ్వానించేందుకు నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ ఈవెంట్ వల్లే ఆ రాష్ట్రంతో బాటు ముంబై, ఢిల్లీ నగరాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఆ సమయంలో ట్రంప్ వెంట వఛ్చిన కొన్ని ప్రతినిధి బృందాలు ఈ నగరాలను విజిట్ చేశాయన్నారు. నమస్తే ట్రంప్ కార్యక్రమం సందర్భంగా గుజరాత్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కాలేదా అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ పత్రిక ‘సామ్నా’లో ఎడిటోరియల్ కాలమ్ రాస్తూ.. ఎలాంటి ప్లానింగ్ లేకుండా కేంద్రం కరోనా వైరస్ లాక్ డౌన్ విధించిందని ఆయన విమర్శించారు.  కరోనా కేసులు పెరిగితే ఇప్పుడు రాష్ట్రాలపై కేంద్రం ఇందుకు బాధ్యత వాటిదే అంటోందన్నారు.  మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి జరిగే ఏ ప్రయత్నమైనా ఆత్మహత్యా సదృశమే అన్నారాయన. లోగడ మా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి ఎత్తివేశారని, కరోనా సాకు చూపి ఈ చర్య తీసుకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా 17 రాష్ట్రాల్లో కూడా రాష్ట్రపతి పాలన విధించాలని రౌత్ పేర్కొన్నారు.