మాస్క్ అడిగినందుకు పోలీసులపై దాడి

ముంబయిలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. ఫేస్ మాస్క్ వేసుకోమ్మనందుకు పోలీసులనే చితక్కొట్టారు. ఈ దాడిలో ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో చోటుచేసుకుంది. కరోనా ప్రభావంతో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ముంబైలోని అంటోప్ హిల్ ప్రాంతంలో లాక్‌డౌన్‌ నియమాలను అతిక్రమించి కొందరు వ్యక్తులు రోడ్లపైకి వచ్చారు. కనీసం ఫేస్‌ మాస్కులు కూడా ధరించలేదు. నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు వారిని ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. […]

మాస్క్ అడిగినందుకు పోలీసులపై దాడి

Updated on: May 15, 2020 | 4:54 PM

ముంబయిలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. ఫేస్ మాస్క్ వేసుకోమ్మనందుకు పోలీసులనే చితక్కొట్టారు. ఈ దాడిలో ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో చోటుచేసుకుంది.

కరోనా ప్రభావంతో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ముంబైలోని అంటోప్ హిల్ ప్రాంతంలో లాక్‌డౌన్‌ నియమాలను అతిక్రమించి కొందరు వ్యక్తులు రోడ్లపైకి వచ్చారు. కనీసం ఫేస్‌ మాస్కులు కూడా ధరించలేదు. నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు వారిని ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన యువకులు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు కానిస్టేబుళ్లతో సహా ముగ్గురు పోలీసు సిబ్బందిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.