ముంబైలో ఇద్దరు బిలియనీర్ల అరెస్ట్.. ఓ పోలీసు అధికారిపై ‘వేటు’?

| Edited By: Pardhasaradhi Peri

Apr 10, 2020 | 3:25 PM

ముంబైలో బిలియనీర్లు అయిన కపిల్ వాధ్వానీ, ధీరజ్ వాధ్వానీలను పోలీసులు వారి కుటుంబ సభ్యులతో సహా అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. వీరికి సహకరించిన ఓ సీనియర్ పోలీసు అధికారిని తప్పనిసరిగా సెలవుపై వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

ముంబైలో ఇద్దరు బిలియనీర్ల అరెస్ట్.. ఓ పోలీసు అధికారిపై వేటు?
Follow us on

ముంబైలో బిలియనీర్లు అయిన కపిల్ వాధ్వానీ, ధీరజ్ వాధ్వానీలను పోలీసులు వారి కుటుంబ సభ్యులతో సహా అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. వీరికి సహకరించిన ఓ సీనియర్ పోలీసు అధికారిని తప్పనిసరిగా సెలవుపై వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. 1364 కరోనా కేసులతో మహారాష్ట్ర సతమతమవుతుండగా.. పైగా లాక్ డౌన్ అమల్లో ఉండగా ఈ బిలియనీర్లు తమ కుటుంబాలతో బాటు తమ ఫామ్ హౌస్ కి వెళ్లేందుకు ఆ పోలీసు అధికారి ఓ సిఫారసు లెటర్ ఇచ్చాడట. ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని, అందువల్ల లాక్  డౌన్ నిబంధనల నుంచి వీరిని మినహాయించాలని ఆయన తన ఈ లేఖలో పోలీసులను ఆదేశించాడట. అయితే ఆ అధికారితో బాటు వీరి పప్పులుడకలేదు. సతారా జిల్లాలోని మహాబలేశ్వర్ లో వీరిని పోలీసులు అరెస్టు చేసి క్వారంటైన్ కి పంపారు, డీ హెచ్ ఎఫ్ ఎల్ ప్రమోటర్లయిన కపిల్, ధీరజ్ వాధ్వానీలపై ఇదివరకే ఫ్రాడ్ కేసులు దాఖలై ఉన్నాయని మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. పూణే, సతారా జిల్లాల్లో లాక్ డౌన్ ని కఠినంగా అమలు చేస్తున్నారు. వీరు తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని ఖండాలా నుంచి మహాబలేశ్వర్ కు ప్రయాణించేందుకు వీరిని అనుమతించాలని ఆ పోలీసు అధికారి లేఖ ఇచ్చాడని, ఆయనను నిర్బంధ సెలవులో పంపామని, అనంతరం ఆయనపై తగిన చర్యలు తీసుకుంటామని అనిల్ దేశ్ ముఖ్ చెప్పారు. ఎస్ బ్యాంక్ ఫ్రాడ్ కేసుతో కూడా వాధ్వానీలకు సంబంధం ఉన్న సంగతి తెలిసిందే.. వీరి క్వారంటైన్ ముగిసిన అనంతరం వీరిని సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.