రాశీ ఖన్నా జీవితంలో “మిస్టర్ పర్‌ఫెక్ట్‌”…

పుత్తడి బొమ్మ రాశీఖన్నా తమిళంలో మూడు సినిమాల్ని ఒప్పుకున్నారు. ప్రస్తుతం తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తుండటంతో... తమిళంను నేర్చుకుంటున్నారు. ఈ అమ్మడు సుందర్‌ సి దర్శకత్వంలో ‘అరణ్‌మనై-3’తో పాటు సూర్య ‘అరువా’ చిత్రంలోనటిస్తున్నారు.

రాశీ ఖన్నా జీవితంలో మిస్టర్ పర్‌ఫెక్ట్‌...
 స్టార్ హీరోలు కాకపోయినా కూడా మీడియం రేంజ్ హీరోలు బాగానే అవకాశమిస్తున్నారు ఈ ముద్దుగుమ్మకు. 

Updated on: Jun 08, 2020 | 10:56 AM

టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తనకు సంబంధించిన ఓ సంచలన విషయాన్నిబయటపెట్టారు. వ్యక్తిగత విషయాలు, మూవీ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. తన సినిమా జర్నీతోపాటు వ్యక్తిగత జీవితాన్ని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. తన జీవితంలో ఇప్పటి వరకు “మిస్టర్ పర్‌ఫెక్ట్‌” ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. మనసుకు నచ్చిన వ్యక్తి ఎలా ఉండాలనే విషయంలో ఇంత వరకు ఎలాంటి ప్లాన్ సిద్ధం చేసుకోలేదని వెల్లడించారు. “లవ్ ఎట్ ఫస్ట్ సైట్” అనే పదాన్ని తాను నమ్మనని… తొలి ప్రేమకు తన జీవితంలో చోటులేదన్నారు. ప్రేమ,పెళ్లి గురించి ప్రస్తుతం ఆలోచించటం లేదని.. తను ప్రేమలో ఉన్నానంటూ వస్తున్న వార్తలను రాశీ కొట్టిపడేశారు. తనకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువే అని… సినిమాలు, పుస్తకాలతోనే తన జీవితం ఎక్కువగా ముడిపడి ఉందన్నారు. సినిమా కెరియర్‌లో పోటీతత్వాన్ని తను నమ్మనని అన్నారు. ఇతర హీరోయిన్లు నటించిన సినిమాలు నచ్చితే ఎలాంటి భేషజాలు లేకుండా అభినందిస్తానని స్పష్టం చేశారు.

ప్రస్తుతం పుత్తడి బొమ్మ రాశీఖన్నా తమిళంలో మూడు సినిమాల్ని ఒప్పుకున్నారు. ప్రస్తుతం తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తుండటంతో… తమిళంను నేర్చుకుంటున్నారు. ఈ అమ్మడు సుందర్‌ సి దర్శకత్వంలో ‘అరణ్‌మనై-3’తో పాటు సూర్య ‘అరువా’ చిత్రంలోనటిస్తున్నారు. అలాగే మేధావి చిత్రంలో జీవాకు జంటగా నటిస్తున్నారు. ఇందు కోసం లాక్‌డౌన్‌ సమయాన్ని చక్కగా వాడుకుంటున్నారు.