Breaking News : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కరోనా కలకలం.. ఎమ్మెల్యే కారుమురికి పాజిటివ్..

ఆంధ్రప్రేదశ్ అసెంబ్లీకి కరోనా వైరస్ సెగ తగిలింది. తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వర్‌ రావుకు కరోనా పాజిటివ్ అని తేలింది.

Breaking News : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కరోనా కలకలం.. ఎమ్మెల్యే కారుమురికి పాజిటివ్..

Updated on: Dec 02, 2020 | 11:43 AM

Corona virus : ఆంధ్రప్రేదశ్ అసెంబ్లీలో కరోనా కలకలం రేగింది. తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వర్‌ రావుకు కరోనా పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన ఆస్పత్రికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. వైద్యులు ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివ్ కారణంగానే నేడు ఆయన అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు. కాగా, కారుమురి నాగేశ్వర్ రావు మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. సభలో ప్రసంగించారు కూడా. దీంతో గత రెండు రోజులుగా కారుమురిని కలిసిన ఎమ్మెల్యేల్లో హై టెన్షన్ నెలకొంది. ఆయనను కలిసిన ఎమ్మెల్యేలు ముందు జాగ్రత్తగా అసెంబ్లీకి గౌర్హాజరయ్యారు. ఆస్పత్రులకు వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారు.