బస్సుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే..కఠిన చర్యలు తప్పవు: మంత్రి పువ్వాడ

|

May 20, 2020 | 5:10 PM

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడుస్తున్నప్పటికీ.. సిటీ బస్సులకు మాత్రం అనుమతి లేదు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు నగరం లోపలికి వెళ్లవు. కానీ,

బస్సుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే..కఠిన చర్యలు తప్పవు: మంత్రి పువ్వాడ
Follow us on

లాక్‌డౌన్ 4.0 లో కేంద్రం అనేక సడలింపులు ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మే 19 నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే పలుచోట్ల బస్సుల్లో కరోనా నివారణ చర్యలు అమలు చేయటంలేదని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఏకంగా రవాణా శాఖ మంత్రే రంగంలోకి దిగారు. ఆర్టీసీ బస్సులో తనిఖీలు చేశారు. నిర్లక్షంగా వ్యవహరించిన డ్రైవర్లు, కండక్టర్లపై మంత్రి మండిపడ్డారు.

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ బస్సుల్లో ఆకస్మీక తనిఖీలు నిర్వహించారు. కోదాడ డిపోకు చెందిన ఓ బస్సులో కండక్టర్ వద్ద శానిటైజర్ లేకపోవడంపై ఆయన ప్రశ్నించారు. డిపోలో ఇవ్వలేదని కండక్టర్ చెప్పడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సూర్యాపేట జిల్లా రీజినల్ మేనేజర్‌తో వెంటనే ఫోన్‌లో మాట్లాడారు. కండక్టర్‌కు శానిటైజర్‌ను అందించని డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

కాగా, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడుస్తున్నప్పటికీ.. సిటీ బస్సులకు మాత్రం అనుమతి లేదు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు నగరం లోపలికి వెళ్లవు. కానీ, జేబీఎస్‌ వరకు మాత్రం వస్తాయి. ఆర్టీసీ బస్సులన్నీ రాత్రి 7 కల్లా డిపోలకు చేరాల్సి ఉంటుంది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటిస్తూ..ప్రయాణంచేయాల్సి ఉంటుంది.